Karnataka Running Car Stuck In Fire: వీడియో: రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు.. వ్యక్తి సజీవదహనం

వీడియో: రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు.. వ్యక్తి సజీవదహనం

ఈమధ్య కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. నిన్న మధ్యప్రదేశ్ లో అగ్ని ప్రమాదం కారణంగా 12 మంది సజీవ దహనం కాగా.. నేడు మరో సంఘటన వెలుగు చూసింది. ఆ వివరాలు..

ఈమధ్య కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. నిన్న మధ్యప్రదేశ్ లో అగ్ని ప్రమాదం కారణంగా 12 మంది సజీవ దహనం కాగా.. నేడు మరో సంఘటన వెలుగు చూసింది. ఆ వివరాలు..

ఈ మధ్యకాలంలో తరచుగా ఏదో ఒక చోట అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్ మింట్ కాంపౌండ్ సమీపంలో కారులో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. రోడ్డు పక్కన నిలిపి ఉన్న బీఎండబ్ల్యూ కారులో మంటలు చెలరేగాయి. లక్షల ఖరీదైన కారు అగ్నికి ఆహూతయ్యింది. ఆ కారు ఎవరిది అనే విషయం కూడా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరోచోట ఈ తరహా ప్రమాదం చోటు చేసుకుంది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగడంతో.. అందులో ఉన్న వ్యక్తి సజీవదహనం అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..

కర్ణాటకలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రానికి చెందిన అనిల్ కుమార్ (48) అనే వ్యాపారవేత్త డిసెంబర్ 26 అనగా మంగళవారం నాడు.. నేలమంగళ నుంచి జలహళ్లికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుది. అంచెపాల్య టోల్ ప్లాజా సమీపంలో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో దారుణం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ.. అనిల్ కుమార్ కారు బానెట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రమాదం గమనించిన ఆయన కారు నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ కారు సెంట్రల్ లాకింగ్ పనిచేయక డోర్లు తెరుచుకోలేదు. రోడ్డు మీద ఉన్న వాళ్లు కూడా ఆయనను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ అవేవి ఫలించలేదు. అప్పటికే మంటల తీవ్రత పెరగడంతో.. అనిల్ కుమార్ కారులోనే సజీవదహనం అయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక గురువారం నాడు.. మధ్యప్రదేశ్‌లోని గుణాలో బంపర్ ఢీ కొనడంతో బస్సు బోల్తాపడి మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది ప్రయాణీకులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు.బస్సు ప్రమాదంపై విచారణకు ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఆదేశించారు. ఈ తరహా ప్రమాదాలు తరచూ జరగకుండా చూడాలని రవాణా శాఖ అధికారుల్ని ఆదేశించారు. బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షలు, గాయపడివారికి 50 వేల రూపాయలు సహాయం ప్రకటించారు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్.

Show comments