Heavy Rains: జులై నెలలో కుండపోతగా వానలు.. శుభవార్త చెప్పిన IMD

జులై నెలలో కుండపోతగా వానలు.. శుభవార్త చెప్పిన IMD

Rains In July.. ఈ ఏడాది ఎండలతో అల్లాడిపోయారు జనాలు. ఎండ వేడిమికి తట్టుకోలేకపోయారు. వానల కోసం ఆశగా ఎదురు చూశారు. అందుకు తగ్గట్లుగానే తొలకరి వాన పలకరించింది. అయితే గతంలో కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. రైతులు సైతం జులై నెలలో కురిసే వానల కోసం ఎదురు చూస్తున్నారు.

Rains In July.. ఈ ఏడాది ఎండలతో అల్లాడిపోయారు జనాలు. ఎండ వేడిమికి తట్టుకోలేకపోయారు. వానల కోసం ఆశగా ఎదురు చూశారు. అందుకు తగ్గట్లుగానే తొలకరి వాన పలకరించింది. అయితే గతంలో కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. రైతులు సైతం జులై నెలలో కురిసే వానల కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ ఏడాది ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. భానుడి భగభగలకు బయటపడిపోయారు ప్రజలు. కాలు తీసి బయట అడుగుపెట్టలేని పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో 50 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. దీంతో వాన రాకడ కోసం ఈగర్లీ వెయిట్ చేశారు. వర్షాలు కురవడంతో తడిసిముదయ్యారు. ఎండల నుండి కాస్తంత ఉపశమనం పొందారు. అయితే ఈ సారి తొలకరి వానలు త్వరగానే పలకరించాయి. రైతన్నలు కూడా పంటలు వేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా లోటు వర్షపాతం గత నెలలో నమోదైంది. 11 శాతం లోటు వర్షపాతం నెలకొంది. దీంతో వర్షాల మీదే వ్యవసాయం చేసే కర్షకులు కాస్త వెనకడుగు వేశారు. ఈ నేపథ్యంలో వాతావరణ విభాగం వారికి గుడ్ న్యూస్ చెప్పింది.

జులైలో వానలు దంచికొట్టనున్నాయట. సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఐఎండీ. ఈశాన్య, వాయువ్య, తూర్పు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా.. దేశ వ్యాప్తంగా కుండపోతగా వానలు కురవనున్నట్లు వాతావరణ విభాగం డైరెక్టర్ డాక్టర్ మృత్యుంజయ్ మహా పాత్ర వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జులైలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 28.04 సెం.మీ కాగా, ఈ సారి సాధారణం కంటే అధికంగా అంటే.. 106 శాతం మేర వానలు కురస్తాయని పేర్కొన్నారు. ఈ లెక్కన భారీగా వానలు కురవనున్నాయి. గోదావరి, మహానది బేసిన్‌లో సాధారణం కంటే..ఎక్కువ వానలు పడతాయని తెలిపారు. అలాగే కొన్ని చోట్ల వరద ముప్పు కూడా పొంచి ఉందని అన్నారు. అలాగే ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడతాయని వెల్లడించారు.

ఇక జూన్‌లో ఉష్ణోగ్రతలలో కాస్తంత వ్యత్యాసం చోటుచేసుకుంది. మే ఎండలతో పోల్చుకుంటే.. వేడి చాలా తగ్గింది. సాధారణంగా జూన్ నెలలో 31.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని మహాపాత్ర పేర్కొన్నారు. వాయువ్య భారత్ లో మాత్రం అత్యధిక ఉష్ణోగ్రతలు.. అంటే 38 డిగ్రీల సెల్సియస్ నమోదైందని తెలిపారు. జులైలో ఎండ వేడిమి తగ్గుతుందని, వాతావరణం చల్లబడుతుందని తెలిపారు. గత 25 సంవత్సరాల కాలంలో జులైలో అత్యధిక వర్షపాతం లేదా సాధారణం కంటే కాస్తంత ఎక్కువ వర్షపాతం నమోదయ్యిందని తెలిపారు. ఈ లెక్కన ఈ ఏడాది రైతులకు కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show comments