వీడియో: జనాలేంటి ఇలా తయారయ్యారు.. పోలీసుల్ని కూడా వదలటం లేదు!

ఒకప్పుడు ఊర‍్లలోకి కానిస్టేబుల్‌ వచ్చినా జనం భయపడిపోయేవారు. ఇక, ఎస్‌ఐ వస్తున్నాడంటే.. ఆ ఊర్లో కలకలం చెలరేగేది. గ్రామాల్లో ఎస్‌ఐ,సీఐలను అప్పట్లో పెద్ద సెలెబ్రిటీలుగా చూసే వారు. గౌరవం కొద్దో.. భయం కొద్దో కానిస్టేబుల్‌తో కూడా మర్యాదగా నడుచుకునేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. పోలీసులను ప్రజలు లెక్కచేయటం లేదు. భయపడ్డం మాట పక్కన పెడితే.. తిరిగి దాడులకు తెగబడుతున్న సంఘటనలే ఎక్కువవుతున్నాయి. తాజాగా, గుజరాత్‌లో  ఓ సంఘటన చోటుచేసుకుంది.

ఓ మహిళ.. పోలీస్‌ కానిస్టేబుల్‌పై దాడికి దిగింది. మద్యం మత్తులో రెచ్చిపోయి హల్‌చల్‌ చేసి జైలుపాలైంది. ఆ వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని ఓ ప్రాంతంలో పోలీసు అధికారులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కారులో వెళుతున్న ఓ మహిళపై అనుమానంతో ఆమె వాహనాన్ని ఆపారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ అని తెలియగానే ఆ మహిళ పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. కారులోంచి బయటకు వచ్చి కానిస్టేబుల్‌తో గొడవ పెట్టుకుంది. ఆయనపై దాడికి సైతం దిగింది.

ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆమెను అడ్డుకుంటున్నా తగ్గలేదు. తాగిన మైకంలో రెచ్చిపోయి మరీ కానిస్టేబుల్‌పైకి దాడికి దిగింది. సదరు కానిస్టేబుల్‌ మహిళ మొబైల్‌ ఫోన్‌ను లాక్కోవటంతో ఈ గొడవ పెద్దదయినట్లు తెలుస్తోంది. అధికారులు ఆమెపై కేసు నమోదు చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆ మహిళ చేసిన పనిని తప్పుబడుతున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments