దారుణం: మహిళా జర్నలిస్ట్ పైకి కుక్కలను వదిలిన మాజీ మంత్రి!

దారుణం: మహిళా జర్నలిస్ట్ పైకి కుక్కలను వదిలిన మాజీ మంత్రి!

రాజకీయ నాయకులు, కొందరు ప్రజాప్రతినిధులు అనేక అక్రమాలకు పాల్పడుతుంటారు. వారి అవినీతిని బయటపెట్టే జర్నలిస్టులపై దాడులు చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. మహిళా జర్నలిస్ట్ పైకి కుక్కలు వదిలాడు ఓ మాజీ మంత్రి.

రాజకీయ నాయకులు, కొందరు ప్రజాప్రతినిధులు అనేక అక్రమాలకు పాల్పడుతుంటారు. వారి అవినీతిని బయటపెట్టే జర్నలిస్టులపై దాడులు చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. మహిళా జర్నలిస్ట్ పైకి కుక్కలు వదిలాడు ఓ మాజీ మంత్రి.

సమాజంలో జరిగే విషయాలను ప్రజలకు తెలియజేయజడం  కోసం జర్నలిస్టులు విధులు నిర్వహిస్తుంటారు. అంతేకాక  సమాజంలో జరిగే అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తుంటారు. ఇంకా చెప్పాలంటే..జర్నలిస్టులు సమస్యలను వెలుగులోకి తేవడంతోనే చాలా ప్రభుత్వాలు స్పందిస్తుంటాయి. ఇది ఇలా ఉంటే.. విధి నిర్వహణలో నిజాయితీగా ఉండే  జర్నలిస్టులపై కొందరు ప్రజాప్రతినిధులు ప్రతాపం చూపుతుంటారు. మరికొన్ని సందర్భాల్లో చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఓ మాజీ మంత్రి తన ఇంట్లో జరిగే ఓ అవినీతి విషయాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన లేడీపై కుక్కలను వదిలారు. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

రాజకీయ నాయకులు, కొందరు ప్రజాప్రతినిధులు అనేక అక్రమాలకు పాల్పడుతుంటారు. ప్రజాధనాన్ని అక్రమ మార్గంలో తమ జేబుల్లో వేసుకుంటారు. అంతేకాక మరికొందరు అక్రమ నిర్మాణాలను చేస్తుంటారు. ఇలాంటి అంశాలను కొందరు జర్నలిస్టులు వెలుగులోకి తెస్తుంటారు. ఈ క్రమంలోనే వారిపై దాడులకు పాల్పడుతుంటారు. తాజాగా  ఓ  పొలిటిషియన్  తన ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నాడు. ఆ విషయాన్ని కవరేజ్ చేయడానికి  ఓ లేడీ జర్నలిస్ట్, కెమెరామ్యాన్ వెళ్లారు. అయితే వారిపైకి సదరు రాజకీయ నాయకుడు కుక్కులు విడిచిపెట్టారు.

ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. బిజూ జనతా దళ్ పార్టీకి చెందిన సినియర్ నాయకుడు, మాజీ మంత్రి రఘనందన్ దాస్  ఈఘటనకు పాల్పడ్డారు. ఈక్రమంలోనే మంగళవారం ఆయనపై పోలీస్ కేసు నమోదైంది. ఒడియా న్యూస్ ఛానల్ ఆర్గస్ న్యూస్ రిపోర్టర్ చిన్మయి సాహూ పని చేస్తుంది. రఘునందన్ దాస్ ప్రభుత్వ క్వార్టర్స్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను  కూల్చివేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్నా చిన్నాయి కవరేజ్ చేయాలని భావించింది. ఆ వార్తను కవర్ చేయడానికి జర్నలిస్ట్ చిన్మయి, కెమెరా మెన్  అక్కడికి వెళ్లారు.

పక్కనే ఉన్న రఘునందన్ దాస్ ఇంటి నుంచి చిన్నాయి ..ఈవార్తను కెమెరాతో కవర్ చేస్తున్నారు. అయితే ఈ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించిన లైవ్ కవరేజ్  ఇవ్వడానికి మాజీ మంత్రి ఒప్పుకోలేదు. పైగా వారిని బెదిరించి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశాడు. చాలా సేపు వాళ్లు అక్కడే ఉన్నారు. ఈక్రమంలో జర్నలిస్ట్ చిన్నయి , కెమెరామ్యన్ పైకి రఘునందన్ దాస్ రెండు కుక్కలను వదిలారు. దీంతో వారు అక్కడి నుంచి ప్రాణభయంతో బయటకు వచ్చేశారు.ఇక ఈ ఘటనపై చిన్మయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మంగళవారం సదరు మాజీ మంత్రిపై  పోలీసులు కేసు నమోదు చేశారు.  మరి.. ఇలాంటి ఘటన నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments