Arjun Suravaram
భార్యాభర్తల మధ్య గొడవలు అనేది సర్వసాధారణం. వివిధ కారణాలతో ఘర్షణ పడి కాసేపటికి తిరిగి కలిసిపోతుంటారు. కానీ కొందరు మాత్రం బద్ధ శత్రువుల్లా మారి.. ప్రాాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ దంపతులు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వారి నిండు జీవితాలను బలి తీసుకుంది.
భార్యాభర్తల మధ్య గొడవలు అనేది సర్వసాధారణం. వివిధ కారణాలతో ఘర్షణ పడి కాసేపటికి తిరిగి కలిసిపోతుంటారు. కానీ కొందరు మాత్రం బద్ధ శత్రువుల్లా మారి.. ప్రాాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ దంపతులు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వారి నిండు జీవితాలను బలి తీసుకుంది.
Arjun Suravaram
సంసారం అనే సాగరంలో ఆలుమగల మధ్య ఆటుపోటులాంటి గొడవలు సహజం. అవి వస్తుంటాయి పొతుంటాయి. కానీ నేటి కాలం దంపతుల మధ్య వస్తున్న గొడవలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా నేటి కాలం భార్యాభర్తలో సర్థుకుపోయే తత్వం కొరవడటం కారణంగానే ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. భాగస్వామిని చంపడం లేదా తాను చావడం వంటివి చేస్తున్నారు. తాజాగా కుటుంబ కలహాలతో ఇద్దరు దంపతులు తనువు చాలించారు. భార్య సుసైడ్ చేసుకున్న విషయం తెలిసి..తట్టుకోలేక..భర్త గన్ తో కాల్చుకుని మరణించాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ ప్రాంతంలో మయాంక్ , కుసుమా దేవి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. అతడు జీఆర్పీ లో కానిస్టేబులు గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే ఆయనకు ఝాన్సీ సిటీకి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో మయాంక్ దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. తరచూ వారిద్దరు ఘర్షణకు దిగేవారని స్థానికులు చెబుతున్నారు. ఈక్రమంలోనే ఇటీవల మరోసారి వీరిద్దరు గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన భార్య కుసుమ దేవి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అది తెలిసి మయాంక్ మనస్తాపానికి గురయ్యాడు. తన ప్రభుత్వ రైఫిల్‌తో కాల్చుకుని మయాంక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే ఏప్రిల్ 19న తొలి విడత లోక్ సభ పోలింగ్ విధుల్లో మయాంక్ పాల్గొన్నాడు. అనంతరం విధులు ముగించుకుని ఏప్రిల్ 21న ఇంటికి వచ్చాడు. అనంతరం అధికారిక రివాల్వర్ తో కాల్చుకుని మయాంక్ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇటీవలే మయాంక్ కుసుమా మధ్య గొడవ జరగ్గా.. అర్దరాత్రి సమయంలో కుసుమ దేవి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో మయాంక్ షాక్ అయ్యాడు. అనంతరం మరుసటి రోజు మయాంక్ ఎన్నికల డ్యూటీకి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం తిరిగి వచ్చి ఇంట్లో ఎవరు లేని సమయంలో తన అధికారిక గన్ తో కాల్చుకున్నాడు. ఇక కాల్పుల శబ్దం విని కుటుంబ సభ్యులు పరిగెత్తుకుని వచ్చి చూడగా రక్తపు మయాంక్ శవమై పడి ఉన్నాడు. భార్య మరణం మయాంక్‌ను కలచివేసిందని, దానితో అతను తీవ్రంగా బాధపడ్డాడని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టంకు తరలించారు. మొత్తం కుటుంబ కలహాలు ఓ సంసారాన్ని నిట్టనిలువున కూల్చడమే కాకుండా.. రెండు జీవితాలను బలి తీసుకున్నాయి.
ఇలా కొందరు దంపతులు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల కారణంగా ఎంతో మంది పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. సర్థుపోయే గుణం లేక.. నిత్యం కొట్లాడుకుంటూ శత్రువుల కంటే దారుణంగా కొందరు భార్యాభర్తలు ప్రవర్తిస్తున్నారు. దంపతుల్లో కొందరు హత్యలు చేసి జైలుకు వెళ్లగా.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా జరిగిన ఘటన కూడా కుటుంబ కలహాలతో జరిగిన మరో ఘోరమే. మరి.. ఈ ఇలాంటి ఘటనల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.