కేంద్రం మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు.. ఇలా దరఖాస్తు చేసుకోండి!

కేంద్రం మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు.. ఇలా దరఖాస్తు చేసుకోండి!

చాలా మంది మహిళలు బయటకు వెళ్లి వివిధ రకాల  ఉద్యోగాలు, పనులు చేస్తుంటారు. అయితే కొందరు మహిళలకు బయటకు వెళ్లి పని చేసే అవకాశం దొరకదు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ మంచి అవకాశం కల్పించింది.

చాలా మంది మహిళలు బయటకు వెళ్లి వివిధ రకాల  ఉద్యోగాలు, పనులు చేస్తుంటారు. అయితే కొందరు మహిళలకు బయటకు వెళ్లి పని చేసే అవకాశం దొరకదు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ మంచి అవకాశం కల్పించింది.

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలను అందిస్తుంది. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల ప్రజలకు వివిధ రకాల పథకాలను ప్రభుత్వం అందిస్తుంది. ఇది  ఇలా ఉంటే.. మహిళలు ఆర్థికంగా బలంగా నిలబడేందుకు కూడా అనే ప్రోత్సాహకాలు అందిస్తుంది. అందుకే వారు ఏదైనా వ్యాపారం చేయాలంటే..వివిధ స్కీమ్ ద్వారా ఆర్థిక సపోర్టు అందిస్తుంది. అంతేకాక గ్రామాల్లో ఉండే వారికి కుట్టుమిషన్లు వంటివి కూడా అందిస్తుంది. కేంద్రం అందించే కుట్టుమిషన్లను పొందేందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి..ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

చాలా మంది మహిళలు బయటకు వెళ్లి వివిధ రకాల  ఉద్యోగాలు, పనులు చేస్తుంటారు. అయితే కొందరు మహిళలకు బయటకు వెళ్లి పని చేసే అవకాశం దొరకదు. అందుకే ఇంటి వద్దే పని చేసే అవకాశం కోసం ఎదురు చుస్తుంటారు. అలాంటి మహిళలకు అత్యుత్తమ పనుల్లో కుట్టుమిషన్ పని  ఒకటి. ఇది డిమాండ్ కి తగ్గ ఉపాధి. మన సమయం బట్టి..సంపాదన ఉంటుంది. ఈ క్రమంలోనే నిరుపేద మహిళలకు కేంద్రం కుట్టు మిషన్ నేర్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తోన్నాయి. అంతేకాక కేంద్ర ప్రభుత్వం కుట్టు మిషన్ యంత్రాలను కూడా అందిస్తుంది.

చాలా మంది మహిళలకు దుస్తువులను కుట్టడం వస్తుంది. కానీ ఇంట్లో కుట్టుమిషన్ ఉండదు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పిస్తుంది. కుట్టు మిషన్ లేనివారు ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. గతంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని ప్రారంభించగా.. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ స్కీమ్ కింద..ప్రతి రాష్ట్రంలో 50 వేల మందికి పైగా కార్మిక కుటుంబాలకు  చెందిన మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని ఉపయోగించుకునేందుకు మహిళలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మీరు ఉచిత కుట్టు యంత్రం పథకం కోసం కింది విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత కుట్టు మిషన్ కోసం దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 20 నుంచి 40 ఏళ్ల మధ్య లో ఉండాలి. అలానే ఆసక్తి ఉన్న మహిళలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ ఎంటర్‌ప్రైజ్ సెంటర్ పథకం  కింద దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి జిల్లా పంచాయతీకి చెందిన వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ పోర్టల్ లింక్ అందుబాటులో ఉంటుంది. దానిపై క్లిక్ చేసి..అవసరమైన సమాచారం అందిస్తూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయ ధృవీకరణ పత్రం, కార్మిక, మొబైల్ నంబర్, టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ లు దరఖాస్తుకు సమయంలో అవసరం ఉంటాయి. అదే విధంగా అడ్రెస్ ఫ్రూప్ కోసం రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ లేదా మరేదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డు ఉంటే సరిపోతుంది. అలానే వితంతువు అయితే ఆ సర్టిఫికెట్, వికలాంగులైతే దాని సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.  అదే విధంగా పంచాయతీ సెక్రటరీ  నుంచి  ధృవీకరణ పత్రం అవసరం. దరఖాస్తు చేయడానికి మీరు అధికారిక వెబ్‌సైట్ https://pmvishwakarma.gov.in/ కి వెళ్లాలి.

ప్రస్తుతం ఉచిత కుట్టు మిషన్ పథకం గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉంది. త్వరలో మిగిలిన  రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ స్కీమ్ కింద మహిళలు కుట్టుమిషన్ పొందేందుకు 15 వేల రూపాయలు పొందుతారు. అక్కడి నుంచి ఎలక్ట్రిక్ కుట్టు మిషన్ కొనుక్కొని మహిళలు ఉపాధి పొందవచ్చు.

Show comments