అయోధ్య ప్రసాదం పేరుతో భారీ స్కామ్‌.. జాగ్రత్తగా ఉండండి

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే, అక్కడి వరకు వెళ్లలేని వారు ఆ రామయ్య ప్రసాదం దక్కిన చాలు అనుకుంటారు. దీనిని అదునుగా తీసుకుని కొంత మంది కేటుగాళ్లు ఆన్ లైన్ లో మోసాలు మొదలుపెట్టారు.

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే, అక్కడి వరకు వెళ్లలేని వారు ఆ రామయ్య ప్రసాదం దక్కిన చాలు అనుకుంటారు. దీనిని అదునుగా తీసుకుని కొంత మంది కేటుగాళ్లు ఆన్ లైన్ లో మోసాలు మొదలుపెట్టారు.

రామ జన్మ భూమి అయోధ్యలో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే దేశ నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు అయోధ్యకు తరలి వెళ్తున్నారు. ఆ ప్రాంతమంతా భక్తి పారవశ్యంతో.. రామ నామం జపిస్తూ మైమరచిపోతున్నారు. అయోధ్య వరకు వెళ్లలేని భక్తులకు టీవీలలో చూసేలా ప్రత్యేక్ష ప్రసారాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటివరకు అయోధ్యకు సంబంధించి ఎన్నో వార్తలను విన్నాము. అందులో అయోధ్యకు వెళ్లిన భక్తులకు పంచే ప్రసాదం గురించి కూడా చూశాము. ఇప్పటికే రాముడి ఆశీర్వాదంగా అక్షింతలను అందుకున్న భక్తులు.. అయోధ్య ప్రసాదాన్ని కూడా స్వీకరించాలనే ఆశతో ఉంటున్నారు. ఈ క్రమంలో అయోధ్యకు వెళ్లలేని భక్తులకు ఆన్ లైన్ ద్వారా ప్రసాదాలు పంపిణీ చేస్తామంటూ.. కొన్ని కొత్త వెబ్ సైట్స్ పుట్టుకొస్తున్నాయి. దీనితో ప్రసాదాలు కొనుగోలు చేయాలి అనుకునే వారిని ఈ వెబ్ సైట్స్ సందిగ్ధంలో పడేలా చేస్తున్నాయి.

ఆన్ లైన్ లో ప్రసాదాలు కొనుగోలు చేయాలి అనుకునే వారు.. కాస్త జాగ్రత్త వహించాలని రామ మందిర నిర్మాణ ట్రస్ట్ తెలియజేసింది. ఎందుకంటే ఇంతవరకు ఇంతవరకు ఆన్ లైన్ ప్రసాదాల పంపిణి గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇటువంటి సౌకర్యాన్ని ఇంకా ప్రారంభించలేదని తెలిపింది. శ్రీరాముని ప్రసాదం కేవలం ఆలయంలో మాత్రమే ఉచితంగా పంపిణి చేస్తున్నట్లు తెలియజేసింది. కానీ, ఆన్ లైన్ లో మాత్రం అయోధ్య ప్రసాదం పంపిణి చేస్తున్నాం అంటూ.. పదుల సంఖ్యలో వెబ్ సైట్స్ పుట్టుకొచ్చాయి. దీనితో ప్రసాదాలు కొనుగోలు చేయాలి అనుకునేవారు సందిగ్ధంలో పడ్డారు. ఈ క్రమంలో ముంబైకు చెందిన ఓ వ్యక్తి ఆన్ లైన్ ప్రసాదాల పంపిణి విషయమై.. నేరుగా రామ మందిర ట్రస్ట్ సభ్యులను సంప్రదించాడు. అప్పుడు అసలు విషయం బయటపడింది. అతడు ఆన్ లైన్ లో తీసుకున్న ప్రసాదాన్ని అక్కడకు తీసుకుని వెళ్ళాడు. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా అతని ప్రసాదాన్ని సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద ఆపారు. ఆ తరువాత రామమందిరం సమీపంలోని ట్రస్టు క్యాంపు కార్యాలయంలో ఉన్న సిబ్బంది.. 10 ప్యాకెట్ల యాలకులు ఆ వ్యక్తికి ఇచ్చారు. ఆ ప్రసాదంలో యాలకులు కలిపి భక్తులకు పంచాలని కోరారు.

అయితే, ఈ విషయమై ట్రస్ట్ క్యాంపు ఇన్‌ఛార్జ్ ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ.. ” రామమందిర ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ . ఈ మందిర ప్రాంగణంలో మాత్రమే ప్రసాదం లభిస్తుంది. ఈ ప్రసాదం కోసం భక్తుల నుంచి ఎలాంటి సొమ్ము తీసుకోవడం లేదు. భక్తులు అప్రమత్తంగా ఉండాలి. ఆన్‌లైన్‌లో ప్రసాదం పంపిణీ చేసే విషయమై ట్రస్టు ఇంకా ఎవరినీ ఆదేశించలేదు.” అని తెలియజేశారు. కాగా, సామజిక మాధ్యమాలలో వివిధ వెబ్ సైట్స్ నుంచి.. రామ మందిరం ప్రసాదం ఉచిత హోమ్ డెలివరీ అని చెబుతున్నారు. మరి కొంతమంది దీనికి కొంత అమౌంట్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఈ క్రమంలో KhadiOrganic.com అనే వెబ్ సైట్ ఆన్ లైన్ లో ఉచితంగా ప్రసాదం డెలివరీ చేస్తామని క్లెయిమ్ చేస్తోంది. కానీ, రామ మందిర ట్రస్ట్ సభ్యులు మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. కాబట్టి, ఆన్ లైన్ లో ప్రసాదాలు కొనుగోలు చేయాలి అనుకునే వారు..కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments