Amazon: అమెజాన్ లో అయోధ్య ప్రసాదం! కేంద్రం నోటీసులు

తాజాగా అయోధ్య రామ మందిర ప్రసాదాన్ని ఆన్ లైన్ లో విక్రయిస్తున్నామంటూ.. కొన్ని ఫేక్ వెబ్ సైట్స్ పుట్టుకొస్తున్న వార్తలను విన్నాము. ఈ జాబితాలో ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ కూడా చేరింది.

తాజాగా అయోధ్య రామ మందిర ప్రసాదాన్ని ఆన్ లైన్ లో విక్రయిస్తున్నామంటూ.. కొన్ని ఫేక్ వెబ్ సైట్స్ పుట్టుకొస్తున్న వార్తలను విన్నాము. ఈ జాబితాలో ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ కూడా చేరింది.

అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీ రామ చంద్రుడు ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి సిద్ధం అవుతున్నాడు. కొన్ని వందల సంవత్సరాల నాటి పూర్వ వైభవం మరల అయోధ్యకు తిరిగి వచ్చిందా.. అన్నట్లుగా అక్కడి వాతావరణం వన్నెలు అద్దుకుంటుంది. రామ నామా స్మరణతో అయోధ్య మహా నగరం పులకించిపోతుంది. వందల సంవత్సరాల కల నెరవేరడానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే అయోధ్యకు కొన్ని వేల కానుకలు, వేడుకలో పాల్గొంటున్న భక్తులకు పంచే ప్రసాదాలు అన్నీ.. ఒక్కొక్కటిగా రాముల వారి వద్దకు చేరుకుంటున్నాయి. అయితే, అక్కడి వరకు వెళ్లలేని భక్తులు కనీసం అయోధ్య ప్రసాదం.. వారికి అందినా చాలు అదే పదివేలు అని భావిస్తూ ఉంటారు. దీనిని అదునుగా తీసుకుని కొంతమంది ఆన్ లైన్ లో అయోధ్య ప్రసాదాన్ని విక్రయిస్తామంటూ.. ఫేక్ వెబ్ సైట్స్ సృష్టిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ కూడా చేరింది.

ప్రస్తుతం అమెజాన్ లో అయోధ్య ప్రసాదాలు అమ్మకం అనే వార్త.. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మన చుట్టూ దేవుడు పేరు చెప్పుకుని అడపాదడపా ఎన్నో మోసాలు జరుగుతూనే ఉంటాయి. అయినా కూడా కొంతమంది ప్రజలు వాటిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. మోసగాళ్లు కూడా దీనినే అదునుగా తీసుకుని .. ప్రజలను నమ్మిస్తూ ఉంటారు. అయోధ్యలో ఇంకా రాముడు ప్రతిష్టాపన కార్యక్రమమే ఇంకా జరగలేదు కానీ.. అప్పుడే అయోధ్య ప్రసాదం అని చెప్పి నకిలీ లడ్డులను ఆన్ లైన్ లో విక్రయించడం మొదలు పెట్టారు. అది కూడా ప్రముఖ ఆన్ లైన్ డిగ్గజ సంస్థ అమెజాన్ ఇలాంటి కార్యకలాపాలకు తెరలేపడంతో.. ఈ వార్త అందరిని ఆలోచింపచేసేలా చేసింది. పైగా ఆన్ లైన్ లో అయోధ్య ప్రసాదాలను విక్రయించడం మొదలు పెట్టగానే వేల సంఖ్యలో ఆడర్లు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది గుర్తించిన కేంద్రం అమెజాన్ చేసిన ఫ్రాడ్ పై నోటీసులు జారీ చేసింది. కాన్ఫెడరేషన్ అఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కు ఈ విషయమై పిర్యాదు చేసింది. వెంటనే అధికారులు అమెజాన్ కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నోటీసులు జారీ చేసింది.

సాధారణ దూద్ పేడాలను.. అయోధ్య ప్రసాదంగా ఆన్ లైన్ లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. http://www.amazonలో స్వీట్ల విక్రయాన్ని ఖండించి.. దానికి సంబంధించిన నోటీసులు జారీ చేసింది. దీనితో ఏడు రోజుల లోగా అమెజాన్ నుండి CCPA ప్రతిస్పందన కోరింది. లేని పక్షంలో దానిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వెల్లడించింది. అలాగే, ప్రజలు ఇలాంటి మోసపూరిత వెబ్ సైట్స్ ను నమ్మకూడదని హెచ్చరించింది. ఏదేమైనా ప్రస్తుతం దేశంలో నడుస్తున్న ముఖ్యమైన టాపిక్ అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన. కాబట్టి , దేవుడి పేరును అడ్డం పెట్టుకుని ఇంకా ఇలాంటి మోసాలు ఎన్నో జరిగే అవకాశాలు లేకుండా పోలేదు. అందువలన ప్రజలంతా ఇటువంటి మోసాల పట్ల అవహగాన కలిగి.. జాగ్రత్త వహిస్తే మంచిది. మరి, ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ఇటువంటి మోసాన్ని చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments