లాటరీలో 2.5 కోట్లు గెలిచినా.. రిక్షా తొక్కుతూనే జీవనం! అసలేం జరిగిందంటే..

గురుదేవ్ సింగ్ అనే 90 ఏళ్ల వృద్ధ రిక్షావాలా లాటరీ గెలుచుకొని కోటీశ్వరుడు అయ్యాడు. 7 నెలల క్రితం లాటరీలో 2.5 కోట్లను గెలుచుకున్నారు. అయినప్పటికీ ఆయన సాదాసీదాగా జీవిస్తున్నారు. ఎందుకంటే..

గురుదేవ్ సింగ్ అనే 90 ఏళ్ల వృద్ధ రిక్షావాలా లాటరీ గెలుచుకొని కోటీశ్వరుడు అయ్యాడు. 7 నెలల క్రితం లాటరీలో 2.5 కోట్లను గెలుచుకున్నారు. అయినప్పటికీ ఆయన సాదాసీదాగా జీవిస్తున్నారు. ఎందుకంటే..

సాధారణంగా ఎవరైన డబ్బు వస్తే.. ఏం చేస్తారు.. వాటిని తమ సొంత ఖర్చులకు  వినియోగిస్తుంటారు. అదే వృద్ధులకు కోట్ల రూపాయల లాటరీ తగిలితే ఏం చేస్తారు?. తమ జీవిత చివరి దశ ఆరోగ్యంగా,హాయిగా సాగేందుకు వాటిని ఖర్చు చేస్తుంటారు. కానీ, ఓ 90 ఏళ్ల వ్యక్తి మాత్రం అందరని ఆశ్చర్యానికి గురి చేసే నిర్ణయం తీసుకున్నారు. రూ.2.5 కోట్ల లాటరీ గెలిచినా కూడా రిక్ష తొక్కుతూనే జీవనం సాగిస్తున్నారు. మరి.. ఆ కోట్ల రూపాయలు ఏమయ్యాయి అనే సందేహం అందరిలో రావచ్చు. మరి.. ఆయన చేసిన పనికి జనాలు ఆశ్చర్యపోవడం ఏంటి, ఆ డబ్బులు ఏమయ్యాయి. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే అసలు కథలోకి వెళ్లాల్సిందే.

పంజాబ్ రాష్ట్రం  మోగా జిల్లాలోని ఓ ప్రాంతంలో గురుదేవ్ సింగ్ అనే 90 ఏళ్ల వృద్ధుడు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన కుటుంబం మట్టిగోడలతో ఉండే ఇంట్లో నివాసం ఉండేది. గురుదేవ్ సింగ్ పిల్లలకు పెళ్లిళ్లు చేసి.. మనవళ్లతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఆయన రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషించేవాడు. పిల్లలకు పెళ్లిళ్లు అయిన తరువాత కూడా గురు దేవ్ సింగ్ రిక్ష తొక్కడం మాత్రం మానలేదు. ఇక మరోవైపు ప్రతి ఏటా పంజాబ్ రాష్ట్రం వైశాఖి లాటరీ డ్రా నిర్వహిస్తుంది.

అలానే 2023 ఏడాదిలో కూడా పంజాబ్ రాష్ట్రం వైశాఖి లాటరీ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో గురుదేవ్ సింగ్ రూ.2.5 కోట్ల లాటరీని గెల్చుకున్నారు. ఇంత పెద్ద మొత్తం గెలవడంతో గురుదేవ్ సింగ్ కుటుంబం అదృష్టరేఖ మారిపోయింది. అప్పటి వరకు కష్టాలు పూర్తిగా పోయ్యాయి. ఇక్కడి వరకు కథ బాగానే ఉన్నా… ఇందులో గురుదేవ్ సింగ్ మరో ట్విస్ట్ ఇచ్చారు. రూ.2.5కోట్ల లాటరీ  గెల్చుకున్నా గురుదేవ్ సింగ్.. 90 ఏళ్ల వయస్సులో కూడా రిక్ష తొక్కడం మానడం లేదు. దానితోనే జీవనం సాగిస్తూ.. డబ్బులు సంపాదిస్తున్నాడు.

లాటరీకి వచ్చిన డబ్బులను ఏం చేశాడంటే.. మట్టిగోడల ఇంటిని.. కొత్త భవనం లాగా మార్చేశారు. లాటరీ డబ్బుతో గురుదేవ్ సింగ్ తన నలుగురు కొడుకులు, కూతురికి ఇళ్ళు కట్టించారు. వారందరికీ కొత్త కార్లు కొనిపెట్టారు. ఇప్పుడు గురుదేవ్ సింగ్ మనవళ్ళు మంచి స్కూళ్ళలో చదువుకుంటున్నారు. ఇది అంతబాగానే ఉన్నా.. ఆయన మాత్రం రిక్షాను తొక్కడం మాత్రం వదల్లేదు. ఎందుకని మీడియా అడగ్గా.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతరం కష్టించాల్సిందేనంటా. అందుకే ఆయన రిక్షా తొక్కుతానంటారు.

ఇలా కుటుంబం గురించే కాకుండా గురుదేవ్ సింగ్ లో మరో కోణం ఉంది. ఆయన చాలాకాలం నుంచి సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందుకే తాను లాటరీ గెలిచిన తరువాత కూడా సామాజిక సేవకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో చేసినట్లుగానే రోడ్లు, వీధులలో గుంతలు పూడ్చడం ఆయన ఇప్పటికీ చేస్తున్నారు. తానే స్వయంగా రిక్షాలో మట్టి, పారలు తీసుకువెళ్ళి గుంతలు పూడ్చేవారు. అలాగే పూల మొక్కలకు నీళ్ళు పోయడమూ ఆగలేదు. సామాజిక సేవ చేయడంలోనే తనకు సంతృప్తి ఉందని గురుదేవ్ సింగ్  తెలిపారు. లక్షల్లో రాగానే కళ్లు తలకెక్కే వాళ్లు ఉన్న ఈ కాలంలో కోట్లు వచ్చిన.. తన పాత జీవితాన్ని మర్చిపోకుండా గడుపుతున్న గురుదేవ్ లాంటి వ్యక్తులు అందరికి ఆదర్శం. మరి.. ఈ 90 ఏళ్ల సమాజ సేవకుడిపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments