ప్రాణాలకు తెగించి చెల్లిని కాపాడిన అక్క.. చిన్న వయసులోనే ఇంత ధైర్యమా?

పిల్లల్లో ధైర్యం అనేది పెంపొందించడం చాలా అవసరం. అలా పిల్లలను తయారు చేయడంలో తల్లిదండ్రులది కీలక పాత్ర ఉంటుంది. ఫలితంగా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కొందరు పిల్లలు ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఘటనలు మనం చూశాం. తాజాగా ఓ అక్క కూడ తన చెల్లి కోసం ప్రాణాలకు తెగించింది.

పిల్లల్లో ధైర్యం అనేది పెంపొందించడం చాలా అవసరం. అలా పిల్లలను తయారు చేయడంలో తల్లిదండ్రులది కీలక పాత్ర ఉంటుంది. ఫలితంగా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కొందరు పిల్లలు ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఘటనలు మనం చూశాం. తాజాగా ఓ అక్క కూడ తన చెల్లి కోసం ప్రాణాలకు తెగించింది.

ప్రమాదం అనేది ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవ్వరం చెప్పలేము. ఇలా అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. మరెందరో తీవ్రంగా గాయపడి జీవితాన్ని నరకంగా అనుభవిస్తుంటారు. అయితే కొందరు మాత్రం ప్రమాదాల సమయంలో తమ సమయస్ఫూర్తిని ప్రదర్శించి బయట పడుతుంటారు. అలా కేవలం వారు బయట పడటమే కాకుండా ఎంతో మందిని కాపాడుతుంటారు. అయితే ఇలాంటి  సమయంలో కొందరు పిల్లలు సైతం ధైర్య సాహసాలు ప్రదర్శించి ఔరా అనిపిస్తుంటారు. తాజాగా 13 ఏళ్ల బాలిక.. ఓ ప్రమాదం నుంచి తన చెల్లిని కాపాడి.. అందరి ప్రశంసలు అందుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఉతర ప్రదేశ్  రాష్ట్రం బస్తీ జిల్లాలో 13 ఏళ్ల నిఖిత తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. నిఖితకు ఓ  చెల్లెలు కూడ ఉంది. రోజూ తన చెల్లితో నిఖిత ఆడుకుంటుండేది. ఓ  రోజు కుటుంబ సభ్యులందరూ ఎవరి పనుల్లో వారు  బిజీగా ఉన్నారు. అందరు ఇంటి పై అంతస్తులో ఉన్నారు. నిఖిత..తన చెల్లి మాత్రం కింద ఆడుకుంటున్నారు. ఇలా వారిద్దరు సమయంలో పెద్ద సంఖ్యలో కోతులు ఇంట్లోకి  చొరబడ్డాయి. నేరుగా వంటగదిలోకి వెళ్లి, వంట సామాన్లు చిందరవందర చేశాయి.  అంతేకాక కొన్ని వస్తువులను నోటి తో కొరికి దూరంగా విసిరి పారేశాయి. అంతేకాక కొన్ని గాజు వస్తువులను పగగొట్టి రచ్చ రచ్చ చేశాయి. ఇవేమి చాలవన్నట్లు నిఖిత చెల్లెలిపై దాడికి ప్రయత్నించాయి.  కుటుంబ సభ్యులంతాపై అంతస్థులో వేరే గదిలో ఉండటంతో వారికి కింద జరుగుతున్న ఘటన తెలియలేదు.

దీంతో నిఖిత  తన తల్లిని పిలవడానికి ప్రయత్నించింది.  అమ్మ అంటూ పెద్దగా కేకలు వేయడంతో ఆ కోతులు మరింత రెచ్చిపోయి వారి మీదకు దాడికి యత్నించాయి. కాసేపు వాటి నుంచి తప్పించుకునేందుకు నిఖిత విశ్వ ప్రయత్నం చేసింది. అయినా అవి ఎంతసేపటికి అక్కడి నుంచి పోవడంతో  లేదు. తన చెల్లెలి ప్రాణాలు ఎలాగైన రక్షించాలని నిఖిత భావించింది. అదే సమయంలో నిఖితకు ఓ ఆలోచన వచ్చింది.  తమ వద్ద ఉన్న అమెజాన్ వాయిస్ అస్టిస్టెంట్ అలెక్సను వినియోగించాలని భావించింది. కోతిని భయపెట్టేలా కుక్కలా గట్టిగా  మొరగాలని అలెక్సాను నిఖిత ఆదేశించింది. అంతే అలెక్సా పెద్దగా కుక్కులు మొరిగినట్లు శబ్దాలు చేసింది. దీంతో ఆ శబ్దాలకు కోతులు భయపడి పారిపోయాయి.

ఇక ఈ ఘటనపై నిఖిత ఆసక్తిక విషయాలు తెలిపింది. తమ ఇంటికి కొంతమంది అతిథులు వచ్చారని, ఆ సమయంలో వారు గేటు తెరవడంతో కోతులు ప్రవేశించాయని తెలిపింది. ఆ సమయంలో ఇద్దరం భయపడ్డామని, అదే సమయంలో అప్పుడు కుక్క  మొరిగే శబ్దాలను  ప్లే చేయమని అలెక్సాను ఆదేశించానని తెలిపింది. అలెక్సా చేసిన శబ్దాలకు కోతులు భయపడి పారిపోయాయని నిఖితా జరిగిన సంఘటనను ఏఎన్‌ఐతో వివరించింది. పిల్లలకు సరైన విధానంలో టెక్నాలజీని వినియోగించడం నేర్పిస్తే..ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి.. సమయస్ఫూర్తితో చెల్లెలి ప్రాణాలు కాపాడిన ఈ సాహస బాలికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments