యశ్ బర్త్ డే వేడుకల్లో తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతూ..

Tragedy at Yash birthday celebrations: కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్ సీరీస్ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు యశ్. అప్పటి వరకు కన్నడ పరిశ్రమకే పరిమితమైన యశ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

Tragedy at Yash birthday celebrations: కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్ సీరీస్ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు యశ్. అప్పటి వరకు కన్నడ పరిశ్రమకే పరిమితమైన యశ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు వచ్చారు.. కానీ సరైన సక్సెస్ లేక వెనుతిరిగిపోయారు. ఒక్క సినిమాల విజయంతో ఏకంగా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన హీరోలు ఉన్నారు. అలాంటి హీరోల్లో యశ్ ఒకరు. కన్నడ టీవీ సీరియల్స్ లో నటించిన యశ్ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. పలు చిత్రాల్లో నటించిన యశ్ కి అంతగా గుర్తింపు లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘కేజీఎఫ్’సీరీస్ తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో యశ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అప్పటి వరకు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా పెరిగిపోయింది. ఇప్పుడు యశ్ నటించే చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా యశ్ పుట్టిన రోజు వేడకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కన్నడ నాట యశ్ అంటే అభిమానించేవారు చాలా మంది ఉన్నారు.. ఆయన సినిమాలు, పుట్టిన రోజు వేడుకల్లో ఎంతో సందడి చేస్తుంటారు. తాజాగా యశ్ పుట్టిన రోజు వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సోమవారం యశ్ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక లోని గడక్ జిల్లాలో కొంతమంది అభిమానులు ఆయన బ్యానర్ ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స కోసం దగ్గలోని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. మరణించిన వారిని హనమంత హరిజన్, నడవినమణి, నవీన్ గజీ లుగా గర్తించారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న తమ మిత్రులు చనిపోవడంతో స్నేహితులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.

కన్నడ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు హీరో యశ్. 1986, జనవరి 8న కర్ణాటక జిల్లాలో హసన్ లోని భువనహళ్లిలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి నటనపై మక్కువ పెంచుకున్న యశ్ చదువు పూర్తయిన తర్వాత స్టేజ్ షోలో ఇస్తూ టీవీ సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2007 లో ‘జంబడ హుడగి’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ యశ్ అంటే ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగాన నటించిన ‘కేజీఎఫ్’ తో ఒక్కసారే జాతీయ స్థాయిలో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పటి నుంచి యశ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ‘టాక్సిక్’మూవీలో నటిస్తున్నాడు.

 

Show comments