Saranya Pradeep: ఆ సీన్‌ చేయడానికి భయపడ్డాను కానీ.. నా భర్త సపోర్ట్ చేశాడు

సుహాస్ హీరోగా ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న చిత్రం అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్. శరణ్య ప్రదీప్ కీలక పాత్ర పోషించింది. ఇందులో ఆమె నటనకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇందులో ఓ సన్నివేశం గురించి ఆమె ఏమన్నారంటే..?

సుహాస్ హీరోగా ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న చిత్రం అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్. శరణ్య ప్రదీప్ కీలక పాత్ర పోషించింది. ఇందులో ఆమె నటనకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇందులో ఓ సన్నివేశం గురించి ఆమె ఏమన్నారంటే..?

షార్ట్ మూవీస్, ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూ హీరోగా మారిన నటుడు సుహాస్. అన్నం ఉడికిందా లేదా అని చెప్పేందుకు మెతుకు పట్టుకుంటే చాలు తెలిసిపోతుంది అన్నట్లుగా కలర్ ఫోటో మూవీతో ఈ చాయ్ బిస్కెట్ (ఓ యూట్యూబ్ ఛానల్) కుర్రాడు.. హీరోగా పనికి వస్తాడని నిర్ధారణైంది. హీరోగా ప్రయత్నిస్తూనే ఫ్రెండ్, విలన్ క్యారెక్టర్స్ లోనూ మెప్పిస్తున్నాడు. అలాగే హీరోగా వస్తున్న ఆఫర్లు ఒడిసిపట్టుకుని.. హిట్స్ అందుకుంటున్నాడు. యునిక్ కథలను ఎంచుకుని ముందుకు సాగుతున్నాడు. తాజాగా అంజాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ అంటూ థియేటర్లలో పలకరించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. సుహాస్ ను హీరోగా మరో మెట్టు ఎక్కించిన చిత్రంగా మారిపోయింది.

అయితే ఇదే మూవీలో ఓ మంచి పాత్రతో మెస్మరైజ్ చేసింది శరణ్య ప్రదీప్. ఫిదా మూవీలో సాయి పల్లవి అక్క పాత్రలో కనిపించిన శరణ్య.. చెప్పుకోదగ్గ మూవీస్ చేసింది. జాను, అర్ధ శతాబ్దం, దొరసాని, శైలజా రెడ్డి అల్లుడు, ఖుషి వంటి సినిమాల్లో ఫ్రెండ్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసింది. కానీ అంజాజీ పేట మ్యారేజ్ బ్యాండ్‌లో కీ రోల్ ప్లే చేసి అదరగొట్టింది. సుహాస్ సోదరిగా ఈ మూవీలో కనిపించి.. తన నటనలతో ఇరగదీసింది. ఆమె యాక్టింగ్ వేరే లెవల్. పద్మ పాత్రలో ఆమె ఏడిపించేసిందంటున్నారు ప్రేక్షకులు. దీంతో ఆమెకు ప్రశంసలు వస్తున్నాయి. ఇంత మంచి రెస్పాన్స్ ముందు నుండే ఊహించామని చెబుతోంది శరణ్య ప్రదీప్.

‘ఇంత మంచి అవుట్ ఫుట్ కోసం ఎంత కష్టపడ్డామో.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి అవన్నీ మర్చిపోయాం. పద్మ క్యారెక్టర్‌కు భారీ రెస్సాన్స్ రావడం, అందరూ కంగ్రాట్యులేషన్ చేస్తుంటే ఏడుపు వచ్చేసింది’అని తెలిపింది. ఇక ఈ మూవీలో న్యూడ్ సన్నివేశం గురించి మాట్లాడుతూ.. ‘ ఇప్పటి వరకు అలాంటి సన్నివేశాల్లో చేయలేదు. చిన్న భయం ఉండేది. అవన్నీ నేను ఓవర్ కమ్ చేసేలా చేశాడు నా భర్త. ఆయన సపోర్టు చేశాడు. నువ్వు చేయు, చేయగలవు, అదీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటూ నన్ను పుష్ చేశారు. ఆయన వల్లే ఆ సీన్ చేయగలిగాను. ఆ సన్నివేశం ఎఫెక్టివ్ అనిపించింది. ఆ సీన్ చూసిన తర్వాత చాలా మంది ఎమోషనల్ అయ్యి.. నాకు మేసేజెస్ చేశారు. ఇది ఛాలెంజింగ్ రోల్. ఆ సన్నివేశంలో ఇలా రావడానికి ఐదుగురు చాలా కోపరేటివ్‌ చేశారు. లేకుంటే సాధ్యం అయ్యేది కాదు. డైరెక్టర్, డీఓపీ, కాస్ట్యూమ్ డిజైనర్ అఖిల, నితిన్, అసోసియేట్ డైరెక్టర్ మాత్రమే ఉన్నారు’ అని తెలిపింది. కాగా, ఇప్పుడు భామా కలాపం పార్ట్ 2లో కనిపించబోతుంది శరణ్య.

Show comments