Dharani
విడాకులు తీసుకుని మూడేళ్లు అవుతున్నా.. సామ్-చై డైవర్స్‌కు సంబంధించి ఏదో ఓ వార్త వస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా సమంత చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. ఆ వివరాలు..
విడాకులు తీసుకుని మూడేళ్లు అవుతున్నా.. సామ్-చై డైవర్స్‌కు సంబంధించి ఏదో ఓ వార్త వస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా సమంత చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. ఆ వివరాలు..
Dharani
కొన్ని బంధాలు కలిసినంత త్వరగా ముగిసిపోతాయి. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటలను ఎక్కువగా జరుగుతుంటాయి. ఏళ్ల తరబడి ప్రేమించుకుంటారు.. పెళ్లి బంధంతో ఒక్కటవుతారు. మరి కారణాలు ఏంటో తెలియదు కానీ.. వివాహమైన కొన్నాళ్లకే విడిపోతారు. ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఉన్న అవగాహన.. పెళ్లి తర్వాత ఎందుకు లోపిస్తుందో అర్థం కాదు. సెలబ్రిటీలు అనే కాదు.. సామాన్యుల విషయంలో కూడా ఇలానే జరుగుతుంటుంది. అలా టాలీవుడ్లో సెన్సేషన్‌గా నిలిచిన జంట నాగ చైతన్య-సమంత. ప్రేమ, పెళ్లి విషయంలో వీరు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అన్యోన్య దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఏం జరిగిందో తెలయదు కానీ.. పెళ్లైన నాలుగేళ్లకే విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు భారీ షాక్ ఇచ్చారు.
వీరిద్దరూ విడిపోయాయి.. మూడేళ్లు అవుతున్నా.. అభిమానులు మాత్రం వీరి డైవర్స్ విషయాన్ని నేటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ అంశంపై నాగచైతన్య కామ్‌గా ఉండగా.. సమంత మాత్రం సందర్భం దొరికిన ప్రతిసారి ఏదో విధంగా తెర మీదకు తీసుకువస్తూనే ఉంది. విడిపోయి ఏళ్లు గడుస్తున్నా.. వీరి విడాకులు గురించి నిత్యం ఏదో ఓ వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.
ఇక విడాకులు తర్వాత సమంత.. చైతుకు సంబంధించిన జ్ఞాపకాలను పూర్తిగా చెరిపివేసే పనిలో ఉంది. దీనిలో భాగంగా ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతా నుంచి డిలీట్ చేసింది. ఇక ఇప్పుడు పెళ్లి గుర్తులను చెరిపివేసే ప్రయత్నాల్లో ఉంది సమంత. ఈ క్రమంలో తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. పెళ్లి డ్రెస్‌ను రీమోడల్ చేయించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
సమంత-నాగచైతన్యల వివాహం.. 2017లో జరిగింది. అయితే సామ్ క్రిస్టియన్ కావడంతో.. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు వీరు పెళ్లి చేసుకున్నారు. హిందూ పద్దతిలో పెళ్లికి పట్టుచీర, నిండుగా నగలు ధరించిన సమంత.. క్రిస్టియన్ పద్దతిలో వివాహానికి మాత్రం వైట్ కలర్ గౌన్ ధరించింది. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత అనగా 2021లో వీరిద్దరి విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ కెరీర్లో బిజీగా ఉన్నారు. ఈక్రమంలో సామ్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లిలో ధరించిన గౌనును మార్చేసి రీమోడల్ చేయించింది సమంత. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వీటితో పాటు.. సుదీర్ఘమైన నోట్‌ను షేర్ చేసింది సమంత. ‘‘స్థిరత్వాన్ని మనం ఎన్నటికి మర్చిపోకూడదు. గతంలో అది మనకు ఒక చాయిస్.. కానీ ఇప్పుడది మన అవసరం. ఈ రోజు నేను ధరించిన ఈ డ్రెస్ నాకు నాకు ఎంతో ఇష్టమైన గౌనును రీమోడలింగ్ చేయించి ఈ కార్యక్రమం కోసం ఉపయోగించాను. దీనిని అందంగా మార్చిన క్రేశాబజాజ్‌కు కృతజ్ఞతలు. నా అలవాట్లను మార్చుకోవడం.. జీవనశైలిని మరింత స్థిరంగా చేసుకోవడంలో.. పాత దుస్తులను రీమోడలింగ్ చేయించడం కూడా ఒక భాగం. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. ఎల్లే లీడర్స్ ఆఫ్ ఛేంజ్‌గా నన్ను ఎంపిక చేసినవారికి కృతజ్ఞతలు ” అంటూ రాసుకొచ్చింది.
ఇక విడాకుల తర్వాత సామ్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. చాలా కాలంగా ఆమె మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఆమె కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికి.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌గా ఉంటుంది సమంత. ఇక తాజాగా సమంత పెళ్లి డ్రెస్‌ను రీమోడల్ చేయించడం మాత్రం సంచలనంగా మారింది.