Venkateswarlu
Venkateswarlu
స్మైలింగ్ క్వీన్ సమంత కొన్ని నెలల పాటు సినిమాలకు దూరం కాబోతున్నారన్న సంగతి తెలిసిందే. గత ఏడాది మైయోసైటిస్ బారిన పడిన ఆమె చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారు. పూర్తి స్థాయిలో ఆరోగ్యంపై దృష్టిపెట్టనున్నారు. అందుకే కొత్త సినిమాలకు ఆమె సంతకం చేయలేదు. ఆనారోగ్య సమస్యలు ఉన్నా.. ఎంతో ఓపిగ్గా రన్నింగ్లో ఉన్న సినిమా షూటింగ్లను ముగించారు. ఆమె నటించిన ‘‘సిటడెల్” షూటింగ్ పూర్తి అయింది.
ఇక, శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ” ఖుషి ” షూటింగ్ కూడా పూర్తయింది. సెప్టెంబర్ 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇలా అన్ని షూటింగ్స్ పూర్తి చేసుకున్నారు సామ్. మరికొన్ని రోజుల్లో ఆమె అమెరికాకు వెళ్లిపోనున్నారు. ఈ నేపథ్యంలోనే సమంత పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ భట్కర్ ఎమోషనల్ పోస్టు ఒకటి పెట్టారు. ఆ పోస్టులో.. ” రెండేళ్లు కలిసి పని చేశాము. మన జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి.
మీరు చికిత్స తీసుకుని మరింత బలం, ధైర్యంతో వెనక్కు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. మీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను” అంటూ సమంతతో కలిసి దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక, ఆ పోస్టుపై సమంత స్పందిస్తూ.. ఆ పోస్టును తన స్టోరీలో యాడ్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. మరి, సామ్ హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ భట్కర్ పెట్టిన ఎమోషనల్ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.