Rashmika: హీరోలతో సమానంగా రష్మిక రెమ్యూనరేషన్! మరోసారి పెంచిందట!

యానిమల్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ "రష్మిక మందన్న". ఈ అమ్మడికి సినిమా ఛాన్సులు వరుసగా క్యూ కట్టడంతో.. రెమ్యూనిరేషన్ కూడా భారీగా పెంచేసిందట రష్మిక.

యానిమల్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ "రష్మిక మందన్న". ఈ అమ్మడికి సినిమా ఛాన్సులు వరుసగా క్యూ కట్టడంతో.. రెమ్యూనిరేషన్ కూడా భారీగా పెంచేసిందట రష్మిక.

ప్రస్తుతం ఓ రకంగా టాలీవుడ్ లో ఫార్మ్ లో ఉన్న హీరోయిన్స్ చాలా కొద్దీ మంది మాత్రమే ఉన్నారు. వారిలో పాన్ ఇండియా లెవెల్లో పరిచయం అయిన వారు చాలా తక్కువ. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు “రష్మిక మందన్న”. చలో చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ .. వరుస సినిమాలలో తన నటనతో .. ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు సంపాదించుకుంది. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పరిచయం అయింది. ఇక ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన “యానిమల్” చిత్రంతో మరోసారి అందరిని ఆకట్టుకుంది రష్మిక. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన “యానిమల్” మూవీతో అటు బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిలో కూడా.. మంచి పేరు సంపాదించుకుంది. దీనితో ఈ అమ్మడికి వరుస సినిమాల క్యూ కట్టాయి. ఈ క్రమంలో ఈ అమ్మడు రాబోయే సినిమాలకు తన పారితోషకన్నా భారీగా పెంచేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

“యానిమల్” మూవీలో గీతాంజలి పాత్రకు తన వంద శాతం న్యాయం చేసింది రష్మిక. తాజాగా కొన్ని ఇంటర్వూస్ లో కూడా ఆ సినిమాలో తన పాత్ర గురించి.. అలాగే ఆమె సినిమాలను ఎలా ఎంచుకుంటుంది. ఎందుకు ఆ పాత్రలు చేస్తుంది అనే విషయాలను చెప్పుకుంటూ వచ్చింది. ఇక సోషల్ మీడియాలో అయితే .. రష్మిక ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఎదో ఒక విధంగా రశ్మికను ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఆ వార్తలు వైరల్ అవ్వడం కూడా సహజం. తాజాగా విజయ దేవరకొండ , రష్మికల వివాహం గురించి కూడా కొన్ని ర్యూమర్స్ వినిపించాయి. దీనితో రష్మికపై ఫోకస్ మరింత పెరిగిపోయింది. అది అలా ఉంటే.. సినిమాల విషయంలోనూ రష్మిక డిమాండ్ మరింత పెరిగిపోయింది. పుష్ప , యానిమల్ సినిమాలతో తన రేంజ్ పాన్ ఇండియా లెవెల్లో పెరిపోవడంతో.. సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.దీనితో రష్మిక కూడా భారీగా తన రెమ్యూనిరేషన్ ను పెంచేసిందట.

కాగా, ప్రస్తుతం రష్మిక “పుష్ప-2” తో పాటు “గర్ల్ ఫ్రెండ్” అనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో కూడా నటిస్తోంది. అయితే, ఈ సినిమాలలో చేస్తున్నందుకు సుమారు రూ. 3 కోట్ల వరకు పారితోషకాన్ని తీసుకుంటున్నట్లు సమాచారం. కానీ, కొత్తగా చేయబోయే ఓ మూవీకి మాత్రం ఏకంగా రూ.4 కోట్ల పారితోషకాన్ని డిమాండ్ చేసిందట రష్మిక. దీనితో ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ అంతా దాదాపు రూ. 3 కోట్ల రెమ్యూనిరేషన్ దగ్గరే ఆగిపోయారు.కానీ, రష్మిక మాత్రం అటు సినిమాలలో క్రేజ్ బాగా పెరగడంతో తన రెమ్యూనిరేషన్ ను పెంచేసింది. మరో వైపు కొత్త సినిమాలు కూడా అలానే క్యూ కడుతున్నాయి ఈ అమ్మడికి . ఇలా వరుస ఆఫర్లు వస్తుంటే కనుక రాబోయే రోజుల్లో.. తన రెమ్యూనిరేషన్ ను మరింత పెంచే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు నెటిజన్లు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments