రష్మిక అంటే ఎంత గౌరవం.. కాళ్లు మొక్కిన నూతన దంపతులు!

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న సౌత్‌ టు నార్త్‌ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయారు. అక్కడ భారీ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అర్జున్‌ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌తో రష్మిక ‘అనిమల్‌’ అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శరావేగంగా సాగుతోంది. ఈ సినిమాతో పాటు తెలుగులో ‘పుష్ఫ 2’లోనూ ఆమె నటిస్తున్నారు. తెలుగులో రష్మిక నటిస్తున్న రెయిన్‌బో అనే మరో సినిమా కూడా షూటింగ్‌ జరుపుకుంటోంది.

వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఆమె తాజాగా షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చారు. తన అసిస్టెంట్‌ సాయి పెళ్లిలో సందడి చేశారు. బంగారు వర్ణం చీరతో సాయి పెళ్లిలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అసిస్టెంట్‌ సాయి దంపతులు రష్మిక కాళ్లు మొక్కారు. దీంతో ఆమె కొంత ఇబ్బందికి గురైనా.. పెద్ద మనసుతో ఆ దంపతులను ఆశీర్వదించారు. తర్వాత ఆ దంపతులతో ఫొటోలు దిగారు. ఇక, రష్మిక పెళ్లికి రావటంతో పెళ్లివారంతా ఫొటోలు, సెల్ఫీలు దిగటానికి ఎగబడ్డారు.

అసిస్టెంట్‌ సాయి దంపతులు రష్మిక కాళ్లు మొక్కిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై స్పందిస్తూ.. ‘‘ రష్మిక అసిస్టెంట్‌ సాయికి చాలా ఆర్థిక సాయం చేశారు. పెళ్లి ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చారు’’.. ‘‘రష్మిక అంటే ఎంత గౌరవం. కాళ్లు మొక్కారంటే.. ఆమె అతడ్ని ఎంత బాగా చూసుకుని ఉంటుందో మరి..’’.. ‘‘ రష్మికది చాలా గొప్ప మనసు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, వైరల్‌గా మారిన రష్మిక వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments