Venkateswarlu
Venkateswarlu
సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇప్పుడీ పేరు ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలకు సుపరిచితమే. 40 ఏళ్ల క్రితం సినిమా పరిశ్రమలోకి వచ్చిన ఆయన.. తన స్టైల్, యాక్టింగ్‌తో ఇండియాలోనే ది బెస్ట్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. విలన్ స్థాయి నుంచి భారత దేశం గర్వించదగ్గ సూపర్ స్టార్‌గా మారారు. రజినీ ఇంత పెద్ద స్టార్ అయినప్పటికి చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయన తన సింప్లిసిటీతో జనాల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. తాజాగా, ఆయన జయనగర బీఎమ్‌టీసీ బస్ డిపోకు వెళ్లారు. అక్కడున్న వారిని సడెన్ సర్‌ప్రైజ్ చేశారు.
ఇంతకీ ఆయన అక్కడికి ఎందుకు వెళ్లారు. డిపో అధికారులను సిబ్బందిని సర్‌ప్రైజ్ చేయాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారా?. దానికి బలమైన కారణంగా ఉంది. రజినీకాంత్ సినిమాల్లోకి రాకముందు బస్ కండెక్టర్‌గా పని చేశారన్న సంగతి తెలిసిందే. ఆయన పని చేసింది మరెక్కడో కాదు.. బెంగళూరు, జయనగర బస్ డిపోలోనే. అందుకే ఆయన తన మూలాలు మర్చిపోలేదు. జైలర్ సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో బీఎమ్‌టీసీ డిపోకు వెళ్లారు. రజినీ అక్కడికి వస్తున్నారన్న సమాచారం ఎవ్వరికీ లేదు.
దీంతో ఆయన డిపోలోకి రాగానే సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆయన మాత్రం చాలా కూల్‌గా వారితో సమావేశం అయ్యారు. కొన్ని నిమిషాల పాటు వారితో మాట్లాడారు. తర్వాత అందరితో ఫొటోలు దిగారు. తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయారు. రజినీ తమ డిపోకు రావటంతో అక్కడి వారు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, రజినీ నటించిన తాజా చిత్రం జైలర్ రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు 600 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. మరి, రజినీకాంత్ బీఎమ్‌టీసీ డిపోకు వెళ్లి అక్కడి వారిని సర్‌ప్రైజ్ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.