Venkateswarlu
Venkateswarlu
ప్రముఖ హిట్టు చిత్రాల దర్శకుడు విలియం ఫ్రైడ్‌కిన్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన లాస్ ఏంజిల్స్‌లోని తన నివాసంలో సోమవారం తుది శ్వాస విడిచారు. హర్రర్ సినిమాల దర్శకుడిగా విలియంకు హాలీవుడ్‌లో మంచి పేరుంది. ఆయన తీసిన రెండు సినిమాలు పలు అకాడమీ అవార్డులను సొంతం చేసుకున్నాయి. 1971లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ ది ప్రెంచ్ కనెక్షన్’ సినిమాకు గానూ ఉత్తమ దర్శకుడిగా మొదటి సారి ఆయన ఆస్కార్ అవార్డు అందుకున్నారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత ‘ది ఎక్సోరిస్ట్’ అనే హర్రర్ సినిమాతో ఇండస్ట్రీ హిట్టు సాధించారు.
అంతేకాదు! ఈ సినిమాకు మరోసారి అకాడమీ అవార్డును సొంతం చేసుకున్నారు. కేవలం హర్రర్ సినిమాలే కాదు.. ఆయన పోలీస్ థ్రిల్లర్ సినిమాలకు కూడా ఓ రేంజ్‌ను క్రియేట్ చేశారు. టెలివిజన్‌లో పని చేసిన ఆయన తనదైన శైలిలో సినిమాలు ఎడిటింగ్ చేసేవారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘ది ప్రెంచ్ కనెక్షన్’ సినిమా టెలివిజన్ డాక్యుమెంటరీ స్టైల్లోనే తీశారు. ఈ సినిమాలోని ఓ కారు ఛేజింగ్ సీన్ అప్పట్లో చాలా ఫేమస్ అయింది. ఈ సినిమాకు దర్శకుడిగా విలియంకు ఆస్కార్‌ను తెచ్చిపెట్టడంతో పాటు మరికొన్ని విభాగాల్లోనూ ఆస్కార్‌లను సొంత చేసుకుంది.
విలియం టెలివిజన్ ప్రొగ్రామ్ డైరెక్టర్‌గా జీవితాన్ని మొదలుపెట్టారు. ఆయన దాదాపు 2000లకు పైగా టెలివిజన్ ప్రొగ్రామ్స్‌కు దర్శకత్వం వహించారు. వాటిలో ఎన్నో వాటికి పలు అవార్డులు సైతం వచ్చాయి. కాగా, శాండల్‌వుడ్‌లోనూ విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హీరో విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన కన్నుమూశారు. బ్యాంకాక్ పర్యటనలో ఉన్న ఆయన భార్య స్పందన అకస్మాత్తుగా వచ్చిన గుండె పోటు రాడవంతో ప్రాణాలు వదిలారు. మరి, సినీ పరిశ్రమలో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.