Naga Chaitanya: మంచి మనస్సు చాటుకున్న నాగ చైతన్య.. పిక్స్ వైరల్

మంచి మనస్సు చాటుకున్న నాగ చైతన్య.. పిక్స్ వైరల్

తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని కుటుంబం ఒకటి. నాగేశ్వరరావు నట వారసులుగా నాగార్జునతో పాటు ఆయన కుమారులు ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు. వీరిలో నాగ చైతన్య డిఫరెంట్ లైఫ్ స్టైల్ ను ఇష్టపడుతుంటారు. మూవీస్, కార్ రేస్ వంటి తనదైన ప్రపంచంలో..

తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని కుటుంబం ఒకటి. నాగేశ్వరరావు నట వారసులుగా నాగార్జునతో పాటు ఆయన కుమారులు ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు. వీరిలో నాగ చైతన్య డిఫరెంట్ లైఫ్ స్టైల్ ను ఇష్టపడుతుంటారు. మూవీస్, కార్ రేస్ వంటి తనదైన ప్రపంచంలో..

నటీనటులు తమ సినిమాలతో ప్రేక్షకుల అభిమానాన్నిసంపాదించుకుంటారు. కానీ, చాలా కొద్ది మంది నటులు మాత్రమే సమాజ సేవ చేస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటారు. యాక్టర్స్ నిజ జీవితంలో ఆచరించి చూపిన పనులు, వారి అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇటువంటి ఓ మంచి పని చేసి వార్తల్లో నిలిచారు ‘అక్కినేని’ వారి వారసుడు ‘నాగ చైతన్య’. నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాత, తండ్రుల వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కుర్రాడు.. చాలా సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

తాజాగా ఈ హీరో హైదరాబాద్ లోని సెయింట్ జూడ్ చైల్డ్ కేర్ సెంటర్ లో సందడి చేశారు. అక్కడ కాన్సర్ తో పోరాడుతున్న చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు చిందించారు. వారితో కలిసి ఆడి పాడి వారికి ఆనందాన్ని కలిగించారు మన చైతూ. నవంబర్ 14 న బాలల దినోత్సవం సందర్భంగా చైతన్య చైల్డ్ కేర్ సెంటర్ కు వెళ్లినట్టు తెలుస్తుంది. అక్కడ చిన్నారులతో ఆయన కొంత సమయం గడిపారు. వారితో కలిసి ఆడుకున్నారు. చిన్నారులకు ఎన్నో బహుమతులను అందించారు. ఇప్పుడు వాటికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అభిమానులు కూడా ఈ ఫొటోస్ ను లైక్స్ చేస్తూ ,షేర్ చేస్తూ సంతోషపడుతున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చైతూ రాకతో చైల్డ్ కేర్ సెంటర్ సందడిగా మారిందంటూ నెటిజన్లు ఆ ఫొటోస్ ను తెగ వైరల్ చేస్తున్నారు

ఇక ఈ ఏడాది విడుదలైన ‘కస్టడీ’ మూవీ తో అభిమానులను అలరించారు నాగ చైతన్య. ప్రస్తుతం ‘చందూ మొండేటి’ దర్శకత్వంలో మరో సినిమా కు శ్రీకారం చుట్టారు మన హీరో. మత్స్య కారుల జీవితాలకు అద్దం పట్టేలా కొన్ని యదార్ధ సంఘటనలతో తెరకెక్కనుంది ఈ చిత్రం. ఇప్పటికే ఈ సినిమా కోసం చైతూ తన లుక్ ను మార్చుకున్నారు. ఈ చిత్రంలో మరోసారి ‘సాయి పల్లవి’,’నాగ చైతన్య’ కాంబినేషన్ ను చూడబోతున్నాం. మరోవైపు ఈ హీరో నటించిన మొదటి వెబ్ సిరీస్ “దూత” విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సిరీస్ కు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం , కన్నడ భాషల్లో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక అయిన ‘అమెజాన్ ప్రైమ్’ లో ‘డిసెంబర్ 1’ న స్ట్రీమింగ్ కానుంది. ఇలా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారని చెప్పి తీరాల్సిందే. ఏదేమైనా నాగ చైతన్య చేసిన ఈ సేవా కార్యక్రమం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.. మరి ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments