దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ మూవీ లియో. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డివైడెడ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద రన్ అవుతోంది. దీని కలెక్షన్స్ కి సంబంధించి ఒక్కో చోట ఒక్కో టాక్ వినిపిస్తుంది. ఇంతకీ లియో పరిస్థితి ఏంటి..
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ మూవీ లియో. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డివైడెడ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద రన్ అవుతోంది. దీని కలెక్షన్స్ కి సంబంధించి ఒక్కో చోట ఒక్కో టాక్ వినిపిస్తుంది. ఇంతకీ లియో పరిస్థితి ఏంటి..
ఇండస్ట్రీలో సినిమాలకి హైప్ అనేది చాలా అవసరం. రిలీజ్ కి సిద్ధమైన సినిమాలకు మరీ ముఖ్యం. సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ కి హైప్ ఎంతలా హెల్ప్ అవుతుందో.. ఒక్కోసారి అదే హైప్ మైనస్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఫుల్ హైప్ తో వచ్చి.. బాక్సాఫీస్ వద్ద చతికిల పడిన సినిమాలను చూశాం. అసలు ఎలాంటి బజ్ లేకుండా వచ్చి అద్భుతాలు క్రియేట్ చేసిన సినిమాలు కూడా చూశాం. అయితే.. ఇటీవల విడుదలైన ‘లియో’ మూవీ మాత్రం ఆ రెండింటికి మధ్య ఎటు తేలని పరిస్థితిలో ఉందని అంటున్నాయి సినీవర్గాలు. దసరా సందర్బంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన లియో.. మొదటి వారం పూర్తి చేసుకుంది.
దీంతో కమర్షియల్ గా సినిమా ఫలితం ఏంటనేది తెలియక డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫ్యూషన్ లో ఉన్నారట. దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో మూవీ.. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19న రిలీజ్ అయ్యింది. లోకేష్ ఆల్రెడీ LCU క్రియేట్ చేయడంతో.. లియోపై ముందునుండి విపరీతంగా అంచనాలు ఏర్పడిపోయాయి. కట్ చేస్తే.. ఫస్ట్ డే ఓపెనింగ్స్ అదరగొట్టేసింది. అసలు ఇంతవరకు ఏ తమిళ హీరో సాధించని ఫీట్ ని లియో అందుకుందని ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పటిదాకా లియో దాదాపు రూ. 500 కోట్ల వరకు గ్రాస్ రాబట్టిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
లియో యూఎస్ లెక్కల్లో పొరపాట్లు ఉన్నాయని మొన్నటిదాకా సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. తెలుగులో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాలలో పరుగులు తీస్తోంది లియో. రూ. 17 కోట్లకు బిజినెస్ జరగ్గా.. ఇప్పటికి రూ. 22 కోట్లకు పైగా వసూల్ చేసింది. డివైడెడ్ టాక్ తో అన్ని కోట్లు కొల్లగొట్టడం మామూలు విషయం కాదు. తమిళంలో జైలర్ ని మించిన లెక్కలు చెబుతున్నారు. మొదటి మూడు రోజులు ఊపు కనిపించినా.. ఆ తర్వాత మెల్లగా పడిపోయాయి అనేది వాస్తవం. ప్రస్తుతం లియో టార్గెట్ రూ. 600 కోట్లట. లెక్కల్లో క్లారిటీ లేదు కాబట్టి.. ఇది సాధ్యం అయ్యే పని కాదని ట్రేడ్ వర్గాల అంచనా. మరి లియో ఇంతకీ హిట్టా.. ఇంకా టార్గెట్ ఉందా? అనేది తెలియాల్సి ఉంది. మరి లియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.