krishna bhagavan funny comments on Indraja in Jabardasth: ఇంద్రజ ఇక నైటీ వేసుకునే వస్తారు.. కామెడీ షోలో కృష్ణ భగవాన్

ఇంద్రజ ఇక నైటీ వేసుకునే వస్తారు.. కామెడీ షోలో కృష్ణ భగవాన్

బుల్లితెరపై నవ్వులు పూయిస్తున్న కామెడీ షోలల్లో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి వాటికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ ప్రోగ్రామ్స్ లో కడుపుబ్బ నవ్వించే పంచులతో ఆద్యాంతం హాస్యం తెప్పిస్తూ ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ వంటి కామెడీ షో కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. డిఫరెంట్ కంటెంట్ తో కమెడియన్స్ స్కిట్స్ చేస్తూ జబర్దస్త్ వేదికపై నవ్వులు పూయిస్తున్నారు. కాగా తాజాగా విడుదలైన జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో షోకి జడ్జీగా వ్యవహరిస్తున్న కృష్ణ భగవాన్ తనదైన కామెడీ టైమింగ్ తో మరో జడ్జీ ఇంద్రజపై సరదాగా పంచులేశారు.

కమిడియన్ గా పలు సినిమాల్లో అలరించిన కృష్ణ భగవాన్ జబర్దస్త్ షోకి జడ్జీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కంటెస్టెంట్లు చేసే స్కిట్లల్లో వచ్చే పంచులు ఒకెత్తైతే కృష్ణ భగవాన్ వేసే పంచులు మరో ఎత్తు. ఏ మాత్రం అవకాశం ఉన్నా తనదైన స్టైల్లో పంచులు వేస్తూ రెట్టింపు నవ్వుల్ని తెప్పిస్తారు. అదేవిధంగా నటి ఇంద్రజ కూడా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో జడ్జీగా కొనసాగుతోంది. కాగా తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో నైటీలపై స్కిట్ చేయగా రేపటి నుంచి ఇంద్రజ నైటీలోనే వస్తారంటూ కామెంట్ చేశాడు.

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో నాటీ నరేశ్-నూకరాజు కలిసి ఓ స్కిట్ చేశారు. ఇందులో భాగంగా లేడీ గెటప్‌లో నైటీ వేసుకొని ఎంట్రీ ఇచ్చాడు నరేశ్. అలా వస్తూ ఇంద్రజ వదిన అని పలుకరిస్తాడు.. దీనికి నన్నేనా పిలుస్తుందంటూ ఇంద్రజ నరేష్ వైపు చూస్తుంది. దీనికి రిప్లైగా నిన్నే వదిన అంటూ.. నైటీలో ఉన్న కంఫర్ట్ చీరల్లో అస్సలు ఉండదు.. నైటీ వేసుకుంటే ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా ఉంటుందో తెలుసా అని నరేశ్ అన్నాడు. నరేష్ తో మాట కలుపుతూ ఎంత ఫ్రీగా ఉంటుందో తెలుసా అంటూ ఇంద్రజ కూడా అనేసారు.

దీంతో వేదికంతా నవ్వులతో నిండిపోయింది. ఆ తర్వాత నూకరాజు ఈ రోజు నీ పుట్టిన రోజు కదా ఏం తీసుకురావాలి అని అడుగుతాడు. దీనికి నరేష్ మల్లెపూలు, హల్వా, హల్వాతో పాటు నైటీలు తీసుకురా అనడంతో మరింత ఫన్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ స్కిట్ ముగిసిన జడ్జిమెంట్ ఇచ్చే టైంలో “మా అందాలు అలా చూపించడం ఇష్టం లేక మేము నైటీలు వేసుకుంటున్నాం.. వాట్ ఈస్ ద వ్రాంగ్ ఇన్ దట్” అంటూ ఇంద్రజ అన్నారు. పక్కనే ఉన్న కృష్ణ భగవాన్ రేపటి నుంచి జడ్జిగా ఇంద్రజ నైటీ వేసుకునే వస్తారు అనడంతో అందరూ పగలబడి నవ్వుకున్నారు.

Show comments