Young Director Passed Awayఇండస్ట్రీలో విషాదం.. యంగ్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి..!

ఇండస్ట్రీలో విషాదం.. యంగ్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి..!

సౌత్ ఇండస్ట్రీని వరుస చేదు వార్తలు చుట్టుముడుతున్నాయి. సీనియర్ నటులు ఈశ్వరరావు, చంద్రమోహన్ ఈ నెలలోనే కన్నుమూసిన సంగతి విదితమే. అలాగే మలయాళ నటీమణులు కూడా మరణించారు. ఇప్పుడు ఓ యంగ్ డైరెక్టర్ అనుమానాస్పద రీతిలో మరణించారు.

సౌత్ ఇండస్ట్రీని వరుస చేదు వార్తలు చుట్టుముడుతున్నాయి. సీనియర్ నటులు ఈశ్వరరావు, చంద్రమోహన్ ఈ నెలలోనే కన్నుమూసిన సంగతి విదితమే. అలాగే మలయాళ నటీమణులు కూడా మరణించారు. ఇప్పుడు ఓ యంగ్ డైరెక్టర్ అనుమానాస్పద రీతిలో మరణించారు.

దక్షిణాది సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కేవలం ఈ నెలలో పలువురు ప్రముఖులు కన్నుమూసిన సంగతి విదితమే. సీనియర్ నటుడు ఈశ్వరరావు.. తన కుమార్తెను చూసేందుకు విదేశాలకు వెళ్లి.. అక్కడే మరణించారన్న వార్త వచ్చింది. ఇంతలో ఒకప్పటి స్టార్ నటుడు, ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చంద్రమోహన్ ఈ నెల 11న తుది శ్వాస విడిచారు. మలయాళ పరిశ్రమకు చెందిన నటుడు వినోద్ థామస్ అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి విదితమే. అంతకముందు మలయాళ ఇండస్ట్రీలో టీవీ, సినీ నటి రెంజుషా మీనన్ ఆత్మహత్య చేసుకోగా, డాక్టర్ ప్రియా గర్భిణీగా ఉండగా.. గుండె పోటు కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు మరో యువ దర్శకుడు అనుమానాస్పద రీతిలో మరణించారు.

ధనుష్ నటించిన కర్ణన్ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించిన మారి సెల్వరాజ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మారిముత్తు.. గతరాత్రి సస్పీషియస్‌గా మరణించారు. గత రాత్రి భోజనం చేసి.. సిగరెట్ స్మోక్ చేసిన కొద్దిసేపటికే దగ్గు రావడం, ఊపిరాడకపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మారిముత్తు మరణించినట్లు తెలిపారు. మారిముత్తు పరియేరుం పెరుమళ, కర్ణన్, మమన్నన్ చిత్రాలకు సహాయ దర్శకుడిగా వ్యవహరించాడు. తూత్తుకుడి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మారిముత్తు.. సినిమాలంటే ఆసక్తితో ఇండస్ట్రీలో వచ్చాడు. ఈ 30 ఏళ్ల అసిస్టెంట్ డైరెక్టర్‌కు భార్య షీబా, 5 ఏళ్ల కుమారుడు శామ్యూల్ ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, మారిముత్తు వచ్చే ఏడాది దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. దానికి కథ కూడా సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది. అతడికి స్మోక్ చేసే అలవాటు ఎక్కువగా ఉందని, ఒక్క రోజులోనే చాలా సిగరెట్లు తాగుతాడని సమాచారం. అధికంగా సిగరెట్లు తాగడం వల్ల ఛాతీలో చిన్న నొప్పిలా మొదలైందని, ఆ తర్వాత ఊపిరాడకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లే సరికి చనిపోయినట్లు తెలుస్తోంది. ఇతడి మృతి వార్త కోలీవుడ్ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. మామన్నన్ విజయానికి మారిముత్తు చేసిన కృషిని గుర్తించి, ఉదయన్ నిధి స్టాలిన్ అవార్డుతో సత్కరించారు. మరికొన్ని రోజుల్లో దర్శకుడిగా మారబోతున్న ఇతడు.. ఇలా చిన్న వయస్సులోనే మరణించాడు.

Show comments