ఆగని కల్కి 2898 ఏడీ కలెక్షన్ల సునామీ.. ఆ సూపర్ రికార్డుకు అడుగు దూరంలో!

Kalki 2898 AD Collections.. బాక్సాఫీసు వద్ద కల్కి 2898 ఏడీ కలెక్షన్ల సునామీ ఆగడం లేదు. జూన్ 27న మొదలైన వసూళ్ల పర్వం అప్రతిహతంగా కొనసాగుతుంది. ఈ పదకొండు రోజుల్లో రెబలోడి స్టామినా ఏంటో మరోసారి తెలిసింది.

Kalki 2898 AD Collections.. బాక్సాఫీసు వద్ద కల్కి 2898 ఏడీ కలెక్షన్ల సునామీ ఆగడం లేదు. జూన్ 27న మొదలైన వసూళ్ల పర్వం అప్రతిహతంగా కొనసాగుతుంది. ఈ పదకొండు రోజుల్లో రెబలోడి స్టామినా ఏంటో మరోసారి తెలిసింది.

నాలుగేళ్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం కల్కి 2898ఏడీ రూపంలో కనబడింది దర్శకుడు నాగ్ అశ్విన్‌కి. పురాణాలను.. సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెడుతూ తెరకెక్కించిన మూవీకి బ్రహ్మారథం పట్టారు. ప్రభాస్ మేనియా, నాగ్ అశ్విన్ మ్యాజిక్ వెరసి కల్కి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఈ సినిమాకు ప్రధాన ఆకర్లుకులుగా మారారు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, కమల్ హాసన్. వీరే కాకుండా స్పెషట్ ఎట్రాక్షన్ అయ్యారు దుల్కర్ సల్మాన్, విజయ దేవరకొండ, రాజమౌళి, ఆర్జీవీ, ఫరియా అబ్దుల్లా, మృణాల్ ఠాకూర్,అనుదీప్ వంటి స్టార్స్. దీపికా పడుకొనే, దిశా పటానీ, అన్నాబెన్, మాళవిక నాయర్ తమ నటనతో ఆకట్టుకున్నారు. రాజేంద్రప్రసాద్, శోభన, బ్రహ్మానందం వంటి యాక్టర్స్ ఉన్నారు. రూ. 600 కోట్లతో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది కల్కి.

జూన్ 27తో మొదలైన బాక్సాఫీస్ ఊచకోత అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. తొలి రోజే రూ. 191 కోట్లకు పైగా కొల్లగొట్టింది. నాలుగు రోజుల్లో రూ. 555 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టుకుంది. ఇక వారం గడిచేలోగా రూ. 700కోట్లకు పైగా వసూలు చేసింది కల్కి. అయితే సక్సెస్ ఫుల్‌గా రెండో వారంలోకి దూసుకు వచ్చిన ఈ మూవీకి కలెక్షన్ల జోరు ఏ మాత్రం తగ్గలేదు. రెండు వారాలు గడవకుండానే ఈ మూవీ వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతుంది. సెకండ్ వీకెండ్ కూడా కాసుల వర్షం కురిపించింది. ఈ శనివారం, ఆదివారం కూడా ఈ సినిమాకు ప్రేక్షాకదరణ బాగా దక్కింది. ఈ పదకొండు రోజుల్లో రూ. 900 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఇదే పరంపర కొనసాగితే.. ఈ వారంలో రూ. వెయ్యి కోట్లు కొల్లగొట్టడం పక్కా.

ఈ వారంలో ఇండియన్  2 తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ లేకపోవడంతో రూ. 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు సినీ పండితులు. విడుదలకు ముందు నుండి కల్కి 2898ఏడీ రికార్డులు సృష్టిస్తున్న సంగతి విదితమే. ఇక్కడే కాదు ఓవర్సీస్ బాక్సాఫీసును కూడా షేక్ చేసేస్తుంది.అడ్వాన్స్ టికెట్ బుకింగ్ దగ్గర నుండి ఫాస్టెస్ట్ కలెక్షన్ గ్రాసెర్‌గా నిలిచింది. ఆర్ఆర్ఆర్ రికార్డులను కొల్లగొట్టింది. ఈ 11 రోజుల్లోనే అమెరికాలో 15.5 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకుంది. తన రికార్డులను తన సినిమాలతోనే బ్రేక్ చేసుకుంటున్నాడు ప్రభాస్. ఇక కల్కి 2కు తెరకెక్కుతోన్న సంగతి విదితమే. ఇప్పటికే 40 శాతం కంప్లీట్ అయ్యిందని తెలుస్తుంది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ సలార్ 2లో యాక్ట్ చేయబోతున్నాడని సమాచారం. స్పిరిట్, హనురాఘవపూడి దర్శకత్వంలో మరో మూవీ ఉండనుంది.

Show comments