Swetha
NTR , Prabhas : ఈ ఏడాది అటు ఫ్యాన్స్ కు కానీ .. ఇటు డిస్ట్రిబ్యూటర్స్ కు కానీ లాభం తెచ్చిపెట్టిన సినిమాలు ఏమైనా ఉన్నాయంటే.. అది కేవలం కల్కి , దేవర సినిమాలే. ఈ రెండు సినిమాలు ఎలాంటి మ్యాజిక్ ను చేశాయో చూసేద్దాం.
NTR , Prabhas : ఈ ఏడాది అటు ఫ్యాన్స్ కు కానీ .. ఇటు డిస్ట్రిబ్యూటర్స్ కు కానీ లాభం తెచ్చిపెట్టిన సినిమాలు ఏమైనా ఉన్నాయంటే.. అది కేవలం కల్కి , దేవర సినిమాలే. ఈ రెండు సినిమాలు ఎలాంటి మ్యాజిక్ ను చేశాయో చూసేద్దాం.
Swetha
ఇది రెబలోడి ఊచకోత అంటూ ప్రభాస్ ను.. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ మాస్ జాతర అంటూ ఎన్టీఆర్ ను తెగ పొగిడేశారు అభిమానులు. నిజమే ఈ ఏడాది భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయిన.. భారీ బడ్జెట్ సినిమాలు వీరిద్దరివే. వీరిద్దరూ ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్స్ కాబట్టి.. రిలీజ్ కు ముందు నుంచే వీరి సినిమాలపై హైప్ నడిచింది. ఇక ఒక్కసారి తెరపై బొమ్మ పడిన తర్వాత.. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించారు. కొత్త రికార్డ్స్ సృష్టించారు. దీనితో అభిమానులు ఫుల్ హ్యాపీ. కేవలం అభిమానులు మాత్రమే కాదు.. అటు దర్శకులకు , నిర్మాతలకు , డిస్ట్రిబ్యూటర్స్ కు , థియేటర్ ఓనర్స్ కు.. ఈ ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ వరంగా మారారు. ఎందుకంటే ఒకప్పటిలా ప్రేక్షకులంతా థియేటర్స్ కు క్యూ కట్టే రోజులు పోయాయి. ఎదో భారీ బడ్జెట్ సినిమా లేదా బడా హీరో సినిమా అయితే తప్ప.. థియేటర్స్ కు కదలడం లేదు. ఇక మీడియం రేంజ్ సినిమాలకు చిన్న సినిమాలకు ఓటీటీ నే ఆప్షన్. దీనితో చాలా వరకు సింగల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడ్డాయి.
పాన్ ఇండియా ఫిల్మ్స్ తీస్తూ.. కాస్తో కూస్తో సక్సెస్ రేట్ ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీలోనే పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఇక బాలీవుడ్ సంగతి చెప్పక్కర్లేదు. ఎందుకంటే, అక్కడ వందల కోట్లు తెచ్చిపెట్టే సినిమాలు చాలా తక్కువ. ఖాన్ లు కపూర్ లు వారి వంతు ప్రయత్నం చేస్తున్నా కానీ వర్కౌట్ కావడం లేదు. దీనితో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ , సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. సరిగ్గా ఇలాంటి సమయంలో సీన్ లోకి ఎంటర్ అయ్యారు ఆ ఇద్దరు. బాలీవుడ్ లో ఖాన్ లు కపూర్ లు చేయలేని పని.. మన పాన్ ఇండియా స్టార్లు చేశారు. ఎక్కడో రాజస్థాన్ లో మూతపడ్డ రెండు థియేటర్స్ ను , లక్నోలోని మూడు థియేటర్స్ తో పాటు ఇద్దరు డిస్ట్రిబ్యూటర్స్ ను కాపాడారు. ఒకవేళ ఈ ఏడాది కల్కి , దేవర సినిమాలు రాకపోయి ఉంటే.. సింగల్ స్క్రీన్ థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వెన్నులో వణుకు పుట్టేది. కుప్ప కూలిపోయిన నార్త్ ఇండియా మార్కెట్ ను నిలబెట్టారు ప్రభాస్ , ఎన్టీఆర్.
కల్కి రేంజ్ లో దేవర కూడా టాప్ రేంజ్ లో దూసుకుపోయింది. సౌత్ లోను ఈ రెండు సినిమాలు కొంత మంది డిస్ట్రిబ్యూటర్స్ ఫేట్ మార్చాయి. ప్రస్తుతం నార్త్ లో థియేటర్స్ బిజినెస్ చాలా లాస్ లో నడుస్తుంది. అలాంటిది ఈ రెండు సినిమాలు అక్కడ కనక వర్షం కురిపించాయి. మహారాష్ట్ర లోని మూడు జిల్లాల్లో మొత్తం 9 సింగల్ స్క్రీన్ థియేటర్స్ కు ఈ రెండు సినిమాలు ప్రాణం పోశాయి. ఈ వార్త ఇప్పుడిప్పుడే వైరల్ అవుతుంది. మరి పాన్ ఇండియా స్టార్స్ రేంజ్ అలాంటిది. ప్లాప్ డైరెక్టర్స్ హిట్స్ , వెల వెల బోయిన థియేటర్స్ కు కళ తెప్పించడం ఇలాంటివన్నీ ఈ ఇద్దరికే సాధ్యం అని ప్రూవ్ చేశారు. మరి ఈ లిస్ట్ లో తర్వాత ఏ హీరో యాడ్ అవుతాడో చూడాలి. ఇక ప్రస్తుతం దేవర మూవీ ఇంకా థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. మరి థియేట్రికల్ రన్ ఎండ్ అయ్యేలోపు మొత్తం ఎంత రాబడుతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.