P Venkatesh
Jani Master Assistant: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై జానీ శిష్యుడు సంచలన కామెంట్స్ చేశాడు. జానీ అలాంటోడంటూ బాంబ్ పేల్చాడు.
Jani Master Assistant: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై జానీ శిష్యుడు సంచలన కామెంట్స్ చేశాడు. జానీ అలాంటోడంటూ బాంబ్ పేల్చాడు.
P Venkatesh
స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను లైంగిక ఆరోపణల కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గురువారం ఆయనను గోవాలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ కు తరలించారు. జానీని రహస్య ప్రాంతంలో విచారించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జానీని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల అదుపులో ఉన్న జానికి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. జానికి 14 రోజులపాటు రిమాండ్ విధించింది. అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో పోలీసులు జానిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈక్రమంలో జానీ మాస్టర్ శిష్యుడు బాంబ్ పేల్చాడు. జానికి మద్దతుగా కోర్టు వద్దకు చేరుకున్న అతడు జానీ అలాంటోడంటూ సంచలన కామెంట్స్ చేశాడు.
జానీ శిష్యుడు ఓ మీడియా చానల్ తో మాట్లాడుతూ.. జానీ మాస్టర్ చాలా మంచి వ్యక్తి. డ్యాన్స్ ర్స్ కి సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నాడు. ట్యాలెంట్ ఉన్న డ్యాన్సర్స్ ని ఎంకరేజ్ చేసే గుణమున్న వ్యక్తి జానీ అంటూ అతను చెప్పుకొచ్చాడు. డ్యాన్సర్స్ , మాస్టర్ లు అందరం కూడా కుటుంబ సభ్యుల మాదిరిగానే ఉంటాము. ఆ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడి ఉంటే ఆ రోజే చెప్పేది కదా.. ఇన్ని సంవత్సరాలు సైలెంట్ గా ఎందుకు ఉందంటూ జానీ శిష్యుడు ప్రశ్నించాడు. ఐదు సంవత్సరాలుగా లేని ఇబ్బంది ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చిందంటూ మండిపడ్డాడు. జానీ మాస్టర్ తప్పు చేశాడా లేదా అన్నది కోర్టులు తేలుస్తాయి. డ్యాన్సర్స్ గా మేమంతా న్యాయానికి సపోర్ట్ చేస్తున్నాము.
ఆ మహిళా కొరియోగ్రాఫర్ వెనకుండి కావాలనే కుట్ర చేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్నాడు. నేషనల్ అవార్డ్ విన్నర్ గా, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా తన సత్తా చాటుతున్నాడు. అలాంటి వ్యక్తిని తొక్కడానికే ఇదంతా చేస్తున్నారంటూ జానీ శిష్యుడు తెలిపాడు. ఇదిలా ఉంటే జానీపై అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన ఓ మహిళా జానీ తనపై అత్యాచారం చేశాడని, అవుట్ డోర్ షూట్స్ లో లైంగికంగా వేధించాడంటూ ఆరోపిస్తూ పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న జానీని పట్టుకునేందుకు 4 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి సెర్చ్ చేశారు. జానీ గోవాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.