నిర్మాతగా మారి ఇల్లు, ఆస్తులు అమ్ముకున్న తెలుగు హీరోయిన్.. ఎవరంటే

టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఓ నటి అప్పుల పాలై.. ఆస్తులు అమ్మకుంది. ఇంతకు ఎవరా హీరోయిన్‌ అంటే..

టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఓ నటి అప్పుల పాలై.. ఆస్తులు అమ్మకుంది. ఇంతకు ఎవరా హీరోయిన్‌ అంటే..

సినిమాల్లో చాలా మంది ఎంతో గుర్తింపు, క్రేజ్‌ తెచ్చుకుని.. బాగా డబ్బులు సంపాదించుకున్న తర్వాత.. మళ్లీ మూవీస్‌లోనే పెట్టుబడి పెట్టి.. భారీగా నష్టపోతారు. సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రారంభమైన నాటి నుంచి ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. ఈ జాబితాలో ఓ తెలుగు హీరోయిన్‌ కూడా ఉంది. 90వ దశకంలో తన అందం, గ్లామర్‌, యాక్టింగ్‌తో దేశాన్ని ఊర్రూతలూగించి.. స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నిర్మాతగా మారి.. భారీ ఎత్తున​ నష్టపోయింది. ఆఖరికి ఉండే ఇంటిని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఇంతకు ఎవరా హీరోయిన్‌.. ఆమెకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే..

90స్ లో సౌత్‌, బాలీవుడ్‌, భోజ్‌పూరిలో కూడా తన అందం, టాలెంట్‌తో ఓ ఊపు ఊపింది హీరోయిన్ రంభ. సౌత్‌లో అన్ని భాషాలతో పాటు.. హిందీ, బెంగాల్‌, భోజ్ పూరిలో కూడా రాణించింది రంభ. సౌత్‌లో అందరూ ​స్టార్ హీరోల సరసన నటించి.. టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక రంభ తెలుగు అమ్మాయి అనే సంగతి తెలిసిందే. విజయవాడ కు చెందిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. 15 ఏళ్ల వయసులోనే అనగా 1992లో మలయాళ సినిమాతో మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రంభ. మొదటి సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. అదే ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.

ఆ తర్వాత 1993లో తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. దాదాపు తెలుగు, తమిళంలో స్టార్ హీరోలందరి జతగా నటించింది రంభ. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, శ్రీకాంత్, జగపతి బాబు లాంటి హీరోల సరసన నటించిన రంభ.. తమిళంలో రజనీ, కమల్‌, విజయ్‌, అజిత్‌, కార్తీక్‌, అర్జున్‌, ప్రశాంత్‌ వంటి ప్రముఖ హీరోల పక్కన యాక్ట్‌ చేసింది. అదే సమయంలో, ఆమె సల్మాన్ ఖాన్ సరసన జుడ్వా, బంధన్ చిత్రాలలో నటించి బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటింది.

అయితే హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న రంభ.. ఓ తప్పుడు నిర్ణయంతో కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకుంది. హీరోయిన్‌గా టాప్‌ పొజిషన్‌లో ఉన్న రంభ ప్రొడక్షన్‌లోకి దిగి సరిదిద్దుకోలేని తప్పు చేసింది. నిర్మాతగా చేయాలి అంటే సాహసం చేసినట్టే.. ఎంతో అనుభవం ఉంటే తప్ప అక్కడ విజయం సాధించలేం. కానీ రంభ మాత్రం ఆ సాహసం చేసింది. నిర్మాతగా మారాలనుకున్న రంభ ఓ సినిమాను నిర్మించింది. తన సోదరుడు, జ్యోతిక, లైలా ప్రధాన పాత్రలో ఈమూవీని నిర్మించింది. అయితే అది కాస్త బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది.

ఈ సినిమా నష్టాలు మిగల్చడంతో రంభ అప్పుల పాలయ్యింది. వాటిని తీర్చేందుకు చెన్నైలోని మౌంట్‌ రోడ్డులో ఉన్న తన ఇంటిని అమ్మేసిందట. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి.. అప్పుల భారం తగ్గించుకుందని ఆమె సన్నిహితులు చెబుతారు. ఇక సినిమాలు తగ్గుతున్న సమయంలో ఆమె కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తుల, ఓ కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వీరు కెనడాలోనే సెటిల్‌ అయ్యారు. అప్పుడప్పుడు ఇండియా వచ్చి వెళ్తుంటుంది రంభ.

Show comments