భారీ లాభాల్లోకి హనుమాన్! ఇక నుండి అసలు పండుగ!

చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన హనుమాన్ బ్రేక్ ఈవెన్ సాధించి భారీ లాభాల్లోకి అడుగుపెట్టింది. హనుమాన్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా వరల్డ్ వైడ్ గా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన హనుమాన్ బ్రేక్ ఈవెన్ సాధించి భారీ లాభాల్లోకి అడుగుపెట్టింది. హనుమాన్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా వరల్డ్ వైడ్ గా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

సంక్రాంతి పండగ వేళ జై హనుమాన్ నినాదాలతో మారుమ్రోగిపోతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా  ఆ పేరే వినిపిస్తోంది. థియేటర్ల వద్ద హనుమాన్ దండయాత్ర కొనసాగుతోంది. చిన్న సినిమాగా ప్రారంభమయ్యే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కింది. అంతేకాక సంక్రాంతి బరిలో పోటీ పడి విజేతగా నిలిచింది. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజా సజ్జా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇప్పటికే మూడు రోజుల్లోనే మంచి వసూళ్లను రాబట్టింది. సంక్రాంతి పండుగ అయిపోయింది.. కానీ హనుమాన్ కి అసలు పండగ  ఇప్పటి నుంచి మొదలవుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక 100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి హనుమాన్ మూవీ చేరింది.

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన అద్భుతం ‘హనుమాన్‘. ఈ సినిమాలో ఆయన డైరెక్షన్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. యంగ్ హీరో తేజా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల దండయాత్ర సాగిస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ భాషలోనూ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సూపర్ హిట్ టాక్ అందుకోవడంతో ఓపెనింగ్ రోజు కంటే తరువాత రెండు రోజుల్లో హనుమాన్ ఎక్కువ ఆక్యుపెన్సీతో రన్ అవుతోంది. ఫలితంగా మూడో రోజు అయిన  ఆదివారం  వసూళ్ల సునామీ సృష్టించింది. నాలుగో రోజు కూడా అదే స్థాయిలో హనుమాన్ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది.

ఇప్పటికే లాభాల్లోకి ఎంటర్ అయినా హనుమాన్.. రానున్న రోజుల్లో భారీ లాభాలను చూడనుంది. ఇప్పటి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ  వసూళ్లను రాబట్టింది. అంతేకాక 100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.21.35 కోట్లు, రెండో రోజు రూ.29.72 కోట్లు(అదనపు  ప్రీమియమ్స్), మూడో రోజు రూ.24.16 కోట్లు, నాలుగో రోజు రూ.25.63 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మొత్తంగా 100 కోట్ల గ్రాస్ గా, 66 కోట్ల షేర్ ను హనుమాన్ సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

హనుమాన్ మూవీ ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. ప్రస్తుతం సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఈ సినిమాకే పాజిటివ్ టాక్ రావడం, థియేటర్ల సంఖ్య మరిన్ని పెరగనుండటంతో హనుమాన్ సినిమాకు అసలు పండగ ఇప్పటి నుంచి ప్రారంభం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారీ లాభాల్లోకి హనుమాన్ దూసుకెళ్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి.. 100 కోట్ల క్లబ్ లోకి హనుమాన్ మూవీ వెళ్లిందని ట్రేడింగ్ వర్గాలు తెలిపిన వివరాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments