హనుమాన్ బాక్సాఫీస్ డే3 కలెక్షన్.. కాసుల వర్షమే!

Hanuman Movie Day 3 collection: విజువల్ వండర్ హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా రెండో రోజు కంటే మూడు రోజు అయిన సండే ఎక్కువ కలెక్షన్లు సాధించింది.

Hanuman Movie Day 3 collection: విజువల్ వండర్ హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా రెండో రోజు కంటే మూడు రోజు అయిన సండే ఎక్కువ కలెక్షన్లు సాధించింది.

హనుమాన్… ఇప్పుడు ఎక్కడ చూసిన వినిపిస్తోన్న పేరు. ఇండియన్ బాక్సాఫీస్ ను ఈ చిత్రం షేక్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా.. విజేతగా నిలిచింది. జనవరి 12 విడుదలైన హనుమాన్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రేక్షకుల నుంచి  ఊహించని స్థాయిలో ఈ సినిమాకు రెస్పాన్స్ వస్తోంది. క్రియేటివ్ అండ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజా సజ్జా కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కింది. హనుమాన్ సినిమను కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మంచి వసూలతో దూసుకెళ్తోంది. మరి..మూడో రోజూ హనుమాన్ కలెక్షన్ల సునామీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజా కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ కి ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయ్యారు. హనుమాన్ సినిమాను తెరకెక్కించిన విధానం ఆడియన్స్ థియేటర్లలో కట్టి పడేసింది. చిన్న సినిమాగా ప్రారంభమైన హనుమాన్ భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది. సంక్రాంతి బరిలో దూకిన హనుమాన్ చిత్రం..విజేతగా నిలిచింది. తెలుగు తో పాటు హిందీలోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు బహ్మరథం పట్టారు.

హిందీలోనూ ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధించింది. తొలి రెండు రోజులు బాక్సాఫీస్ వద్ద హనుమాన్ మూవీ విధ్వంసం సృష్టించిందనే చెప్పాలి. భారీ కలెక్షన్లతో జెట్ స్పీడ్ లో దూసుకెళ్లింది.  ట్రేడింగ్ వర్గాల సమాచారం ప్రకారం.. దేశ వ్యాప్తంగా హనుమాన్ సినిమా తొలి రోజు రూ.12.20 కోట్లు, రెండో రోజు రూ.12.45 కోట్లు సాధించింది. ఇక మూడో రోజు రూ.15.50 కోట్లు సాధించినట్లు ట్రేడింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా రూ.40.15 కోట్లు వసూళ్లు సాధించిందని ఇన్ సైడ్ టాక్. దీంతో విడుదలైన మూడు రోజుల్లోనే హనుమాన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుంది.

హనుమాన్ సినిమా 3 రోజుల కలెక్షన్లు హిందీలో 12 కోట్ల నెట్, తెలుగు, ఇతర భాషల్లో 42 కోట్లు, 50 కోట్ల వసూళ్లు చేసింది. ఓవర్సీస్‌లో రాబట్టిన 12 కోట్లతో కలిపి ఓవరాల్‌లో ఈ సినిమా 66 కోట్లకుపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరడానికి అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఓవర్సీస్ లోనూ హనుమాన్ దూసుకుపోతోంది. ఇప్పటికే 2 మిలియన్ డాలర్లు పైగా వసూలు చేసినట్లు  తెలుస్తోంది. ఈ క్రమంలోనే యూఎస్ఏలో 2 ఫ్లస్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన 13వ తెలుగు హీరోగా తేజ రికార్డు కొట్టారు. మొత్తం హనుమాన్ మూడో రోజు కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments