శంకర్​ మహదేవన్​, జాకీర్ హుస్సేన్​కి గ్రామీ అవార్డ్స్!

Grammy 2024 Music Awards:ఎంతో ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డు సంగీత ప్రపంచానికి ఒక ఆస్కార్ అని పిలుస్తారు. 66వ గ్రామీ అవార్డ్స్ 2024 ప్రకటించారు.. ఇందులో భారత్ మెరిసింది.

Grammy 2024 Music Awards:ఎంతో ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డు సంగీత ప్రపంచానికి ఒక ఆస్కార్ అని పిలుస్తారు. 66వ గ్రామీ అవార్డ్స్ 2024 ప్రకటించారు.. ఇందులో భారత్ మెరిసింది.

సంగీత పరిశ్రమలో అత్యుత్తమ సేవలు అందించిన వారిని గుర్తించి ప్రతియేటా గ్రామీ అవార్డులు అందజేస్తుంటారు. గ్రామీ అవార్డ్స్ వేడుక మే 4, 1959న నిర్వహించబడింది. మొదట ఈ ట్రోఫీని గ్రామోఫోన్ అవార్డ్స్ అని పిలిచేవారు. ఆ తర్వాత దీనికి గ్రామీ అవార్ట్స్ అని పేరు వచ్చింది. అకాడమీ అవార్డులు (సినిమాలకు), ఎమ్మీ అవార్డులు (టెలివిజన్ ) తో పాటు అమెరికన్ వినోద పుస్కారాల్లో ఒకటి గ్రామీ అవార్డు. లాస్ ఏంజెల్స్‌లోని 66వ వార్షిక గ్రామీ అవార్డు ప్రధానోత్సవం మొదలైంది. సినీ తారలు, దర్శక, నిర్మాతలతో పాటు వివిధ రంగాలకు చెందినవారు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈసారి గ్రామీ అవార్డుల్లో భారత్ మెరిసింది.

ఇటీవల సినీ రంగం, మ్యూజిక్ ఆల్బామ్స్ కి గోల్డెన్ పిరియడ్ వచ్చిందనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సినిమాలకు  ప్రతిష్టాత్మక పురస్కారాలు లభిస్తున్నాయి. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో 66వ ‘గ్రామీ అవార్డుల’ వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యింది. ఈ ప్రతిష్టాత్మక మ్యూజికల్ అవార్డు షో కి ట్రేవర్ నోహ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ వేదికపై టాప్ ఆర్టిస్టులు లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వడంతో మరింత సందడి కనిపించింది. విజేత జాబితా ప్రకటించగానే.. కేకలు, కేరింతలతో వేదిక దద్దరిల్లిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా పలు కేటగిరీల్లో అనేక సాంగ్స్, మ్యూజిక్ ఆల్బామ్స్ పోటీ పడ్డాయి. ఈసారి గ్రామీ అవార్డ్స్ లో భారత్ కి మెరిసిపోయింది. ఏకంగా రెండు అవార్డులు దక్కాయి.

ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు.. ఒక రకంగా సంగీత పరిశ్రమకు ఆస్కార్ అని పిలుస్తారు.   సంగీత పరిశ్రమలో తమ సేవలు అందిస్తూ కోట్ల మంది అభిమానులను సంపాదించిన ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ప్రముఖ తబలా ప్లేయర్ జాకిర్ హుస్సేన్ తో సహా నలుగురు సంగీత కళాకారులు గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. వీరిద్దరూ కంపోజ్ చేసిన ‘దిస్ మూవ్‌మెంట్’కి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ గా గ్రామీ అవార్డు దక్కింది. ఈ పాటకు శంకర్ మహదేవన్ (సింగర్), జాకిర్ హుస్సేన్ (తబల), వి సెల్వ గణేష్ (పెర్కషనిస్ట్), గణేష్ రాజగోపాలన్ (వాయిలెన్) జాన్ మెక్ లాగ్లిన్ (గిటార్) వీరంతా కలిసి కంపోజ్ చేశారు. ఈ అవార్డును తన భార్యకు అంకితమిస్తున్నట్లు శంకర్ మహదేవన్ తెలిపారు. భారతీయ సంగీతం గొప్పతనాన్ని విశ్వవేదికపై చాటి చెప్పిన ప్రముఖులకు సెలబ్రెటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Show comments