ప్రముఖ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య.. కారణమేటంటే?

Malaika Arora: బాలీవుడ్ నటి మలైకా అరోరా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నేడు మలైకా తండ్రి అనిల్ అరోరా ఆయన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. అసలేం జరిగిందంటే..

Malaika Arora: బాలీవుడ్ నటి మలైకా అరోరా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నేడు మలైకా తండ్రి అనిల్ అరోరా ఆయన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. అసలేం జరిగిందంటే..

ప్రముఖ నటి, బ్యూటీ క్వీన్ ‘మలైకా అరోరా’ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీస్ లో ఈమె కూడా ఒకరు. ఇకపోతే ఈ బ్యూటీ సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా మలైకా తనకంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో దాదాపు 5 సంవత్సరాలు రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిదే. ఈ క్రమంలోనే.. ఈ జంట ఎక్కడపడితే అక్కడ చెట్టాపట్టాలు వేసుకుంటూ బాలీవుడ్ మీడియాకు దర్శనమిచ్చేవారు.

కానీ, అంతలోనే ఏమైందో తెలియదు కానీ, గత కొన్ని రోజులు క్రితం వీరిద్దరు విడిపోయారనే రూమర్స్ వినిపించాయి. ఇక ఈ రూమర్స్ పై మలైకా కూడా స్పందించి తాము విడిపోయినట్టు క్లారిటీ ఇచ్చింది. అయితే ప్రస్తుతానికి ఎవరి దారి వాళ్లు చూసుకొని బిజీగా లైఫ్ ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా  మలైకా ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మలైకా తండ్రి నేడు ఇంట్లో ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా నేడు ఉదయం (బుధవారం సెప్టెంబర్ 11వ తేదీ) ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. అయితే అనిల్ అరోరా ముంబై సిటీలోని బాంద్రాలో తాను నివాసం ఉంటున్న ఏడు అంతస్తుల భవనం టెర్రస్ నుంచి పై నుంచి కింద దూకి ఆత్మహత్య చేసుకున్నారు.అయితే ఉన్నట్టుండి మలైకా తండ్రి అనిల్ ఇలా ఆత్మహత్య చేసుకోవాడానికి కారణంమేంటో ఎవరికీ తెలియడం లేదు.ఇక ఈ విషయం తెలిసిన వెంటనే మలైకా అరోరా ఇతర కుటుంబ సభ్యులు ఆయన నివాసంకు వచ్చారు. అలాగే పోలీసులు సైతం  ఘటన స్థలానికి వచ్చి మృతదేహన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.

అయితే అనిల్ ఆత్మహత్యకు కారణం.. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇక అందుకు ట్రీట్ మెంట్ జరుగుతున్నప్పటికీ ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితుల నుంచి సమాచారం వినిపిస్తుంది. కానీ, తండ్రి మరణంపై ఇటు మలైకా అరోరాతో పాటు అమృతా అరోరా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఇకపోతే పోలీసులు అనిల్ అరోరా మృతి అనారోగ్య వల్లే వల్లే ఆత్మహత్య చేసుకున్నారా, మరీ ఏ ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. మలైకా తండ్రి మృతిపై బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీస్ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Show comments