దిల్ రాజు చేతికి అయలాన్ నైజాం రైట్స్..! అప్పుడేమో అలా.. ఇప్పుడు ఇలా!

సంక్రాంతి బరిలో నాలుగు తెలుగు సినిమాలు సందడి చేస్తున్నాయి. వీటికి తోడు రెండు తమిళ మూవీస్ .. తెలుగు డబ్బింగ్ వర్షన్ తో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ థియేటర్ల కొరత తీవ్రంగా ఉన్న సంగతి విదితమే. గుంటూరు కారం కోసం నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ధియేటర్లను..

సంక్రాంతి బరిలో నాలుగు తెలుగు సినిమాలు సందడి చేస్తున్నాయి. వీటికి తోడు రెండు తమిళ మూవీస్ .. తెలుగు డబ్బింగ్ వర్షన్ తో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ థియేటర్ల కొరత తీవ్రంగా ఉన్న సంగతి విదితమే. గుంటూరు కారం కోసం నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ధియేటర్లను..

ఈ సంక్రాంతి బరిలో టాలీవుడ్ నుండి నాలుగు సినిమాలు నిలిచిన సంగతి విదితమే. మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, వెంకీ సైంధవ్, నాగార్జున నా సామి రంగా మూవీస్ పోటీ పడుతున్నాయి. అలాగే ఈగల్ కూడా విడుదల కావాల్సి ఉండగా.. సినీ పెద్దలు జరిగిన చర్చలతో వాయిదా పడింది. వీటికే థియేటర్లు చాలడం లేదని కొట్టుకుంటుంటే.. సందట్లో సడేమియాలా వస్తున్నాయి శివ కార్తికేయన్ అయలాన్, ధనుష్ కెప్టెన్ మిల్లర్ మూవీస్. తెలుగు డబ్బింగ్ వర్షన్లతో ఈ పండుగకే వస్తామంటున్నాయి ఈ చిత్రాలు కూడా. అయితే థియేటర్ల విషయంలో ఇప్పటికే రచ్చ రచ్చ అవుతుంది. మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్ ఓకే రోజు విడుదల కానుండటం.. సింగిల్ స్క్రీన్లన్నీ మహేష్ మూవీకి దిల్ రాజు లాక్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమౌతుంది.

గుంటూరు కారం నైజాం హక్కులను దిల్ రాజు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ నైజాం థియేటర్లన్నీ మహేష్ మూవీకే కేటాయించాడు. దీంతో తీవ్ర విమర్శలు ఎదురౌతున్నా.. ఇది వ్యాపారం అంటూ ముందుకు సాగుతున్నాడు ఈ నిర్మాత. అంతలో తమిళ సినిమాలు కూడా వస్తున్నాయని తెలిసి.. దిల్ రాజును ప్రశ్నించగా.. తెలుగు మూవీస్‌కే థియేటర్లకు దొరకడం లేదు. అలాంటిది తమిళ డబ్బింగ్ సినిమాలను ఎవరు చూస్తారంటూ గతంలో వ్యాఖ్యానించిన దిల్ రాజు.. ఇప్పుడు శివకార్తీకేయన్ అయలాన్ సినిమాను తెలుగులోకి తీసుకు వస్తున్నాడు.  అయలాన్ తెలుగు డబ్బింగ్ హక్కులను దిల్ రాజు కొనుగోలు చేశాడు. నైజాంతో పాటు ఆంధ్రలోని వైజాగ్ హక్కులను ఈ నిర్మాత తీసుకున్నాడు.అదీ కూడా గుంటూరు కారం, హనుమాన్ రిలీజ్ అవుతున్న జనవరి 12నే. గుంటూరు కారం, హనుమాన్ మూవీస్‌కు థియేటర్ల కొరత ఉన్న సమయంలో ఇప్పుడు అయలాన్ మూవీని తీసుకు వస్తుండటంతో ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తుంది.

 జనవరి 12 రిలీజ్ అవుతున్న మహేష్ గుంటూరు కారానికి నైజాంలో 90 శాతం సింగిల్ స్క్రీన్ లాక్ చేసేశాడు. దీంతో థియేటర్లు దొరక్క హనుమాన్ చిత్ర యూనిట్ కిందా, మీదా పడుతోంది. అయితే కంటెంట్‌పై నమ్మకాన్ని పెట్టుకుంది హనుమాన్ టీం. ఇదే విషయాన్ని చిరంజీవి సైతం పేర్కొన్నారు.  హనుమాన్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పంపిణీ చేస్తోంది. ఈ నేపథ్యంలో థియేటర్లు ఆ మూవీకి థియేటర్లు దక్కకుండా దిల్ రాజు ఏకచత్రాధిపత్యం చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.  జనవరి 13న సైంధవ్, 14న నా సామి రంగకు కూడా థియేటర్ల సమస్య ఉంది. ఈ సమయంలో ఆయన అయలాన్ తీసుకురావడం చర్చనీయాంశమౌతుంది. మరీ గుంటూరు కారం, అయలాన్ మూవీకి ఎలా థియేటర్లను సర్దుబాటు చేస్తాడని సందేహంలో ఉన్నారు సినీ పెద్దలు. హనుమాన్‌కు మిగిలిన కాసిన్నీ థియేటర్లు కూడా దిల్ రాజు లాగేసుకుంటారా..? అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మీరు గతంలో అన్నమాట మర్చిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలుగు సినిమాలకే థియేటర్లు చాలడం లేదన్న దిల్ రాజు.. అయలాన్ మూవీని తీసుకురావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments