Swetha
సాధారణంగా ఎవరైనా సరే.. సరదాగా ఎంజాయ్ చేయడానికి బీచ్ కు వెళ్తూ ఉంటారు. అయితే, సముద్రం దగ్గర సూర్యుడు, చంద్రుడు చాలా దగ్గరగా కనిపిస్తుంటారు. దాని వెనుక గల కారణాలు ఏమై ఉంటాయో తెలుసా!
సాధారణంగా ఎవరైనా సరే.. సరదాగా ఎంజాయ్ చేయడానికి బీచ్ కు వెళ్తూ ఉంటారు. అయితే, సముద్రం దగ్గర సూర్యుడు, చంద్రుడు చాలా దగ్గరగా కనిపిస్తుంటారు. దాని వెనుక గల కారణాలు ఏమై ఉంటాయో తెలుసా!
Swetha
ఎవరైనా కానీ బీచ్ కు సరదాగా వారి సమయాన్ని గడపడానికి వెళ్తూ ఉంటారు. నేచర్ లవర్స్ అయితే ఖచ్చితంగా.. సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం, చంద్రాస్తమయం వీటిని చూసేందుకు ఎక్కువగా వెళుతూ ఉంటారు. ఎందుకంటే సాధారణ ప్రదేశాలలో కంటే.. సముద్ర తీరంలో సూర్యుడు, చంద్రుడు మన కళ్ళకు చాలా దగ్గరగా కనిపిస్తూ ఉంటారు. అంతే కాకుండా భూమి, ఆకాశం కలిసే చోట కూడా సూర్యుడు, చంద్రుడు పెద్దగా కనిపిస్తూ ఉంటారు. అలాగే చిన్నతనంలో మన వెనకాలే చంద్రుడు వస్తున్నట్లు కూడా భావించేవాళ్ళం.. అయితే, వీటిని చూడడం అయితే అందరికి ఇష్టమే కానీ.. అవి ఎందుకు అలా కనిపిస్తున్నాయో తెలుసా! దాని వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇప్పటివరకు చాలా మంది సన్ రైజ్, సన్ సెట్ లను చూడడానికి బీచ్ కు వెళ్లే ఉంటారు. అలా సూర్యుడిని అంత దగ్గరగా చూడడం వలన.. చాలా మందికి మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ, మిట్టమధ్యాహ్నం సమయంలో మాత్రం అంత దగ్గరగా కనిపించవు. కేవలం ఉదయం, సాయంత్రం మాత్రమే ఇవి అలా కనిపిస్తూ ఉంటాయి. నిజానికి సూర్యుడు చంద్రుడు.. సమయాన్ని బట్టి, ప్లేస్ ను బట్టి చేంజ్ అయితే అవ్వవు. సముద్ర తీరంలో చూసినా .. వేరే వాళ్ళు వేరే ప్రదేశం నుంచి చూసినా అదే సూర్యుడు, అదే చంద్రుడు ఉంటారు. ఎందుకంటే, వాటి పరిమాణం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అయినా సరే, ఎందుకు ఒక్కో ప్లేస్ లో ఒక్కోలా కనిపిస్తాయంటే.. అది కేవలం చూసే మానవ దృష్టి మీదనే ఆధారపడి ఉంటుందని.. పరిశోధనల్లో తేలింది. దీనినే హ్యూమన్ ఆప్టికల్ ఇల్ల్యూషన్ అని అంటారు.
మానవ మెదడు సూర్యుడు, లేదా చంద్రుడు దగ్గరగా కనిపిస్తున్నాయని భావించడానికి గల కారణం.. కేవలం పోంజో ఇల్యూషన్ అనే భ్రమ. ఎందుకంటే మన కళ్ళకు కనిపించే సూర్యుడు లేదా చంద్రుడు.. కంటే హోరిజోన్ చాలా దూరంగా ఉన్నట్లు మన మెదడు ఊహిస్తుంది. ఈ క్రమంలో ఒకే పరిమాణంలో ఉన్న వస్తువును రెండు ఫ్రేమ్స్ ల రిఫరెన్స్ లో ఉంచినప్పుడు..మన మెదడుకు అవి పెద్దదిగా అర్ధం అవుతుంది. కాబట్టి.. సూర్యుడు, చంద్రుడు సముద్ర తీరాలలో పెద్దదిగా కనిపిస్తాయి అనుకోవడం .. కేవలం మానవుని భ్రమ మాత్రమే అని.. సైన్స్ పరిశోధనల్లో తేలింది. అంతేకాని, సూర్య చంద్రుల పరిమాణాల్లో మాత్రం ఏ మాత్రం చేంజ్ ఉండదు. మరి, ఈ విషయంపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.