IOCLలో‌ 1816 పోస్టులు.. రెండ్రోజుల్లో ముగియనున్న గడువు!.. వెంటనే అప్లై చేసుకోండి

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఈ నోటిఫికేషన్ ను అసలు వదలకండి. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 1816 పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఈ నోటిఫికేషన్ ను అసలు వదలకండి. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 1816 పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఇదే మంచి అవకాశం. భారత ప్రభుత్వ రంగ సంస్థ భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే రిక్రూట్ మెంట్ కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవగా ఇంకో రెండ్రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనున్నది. ఇప్పటి వరకు అప్లై చేసుకోని వారు వెంటనే అప్లై చేసుకోంది. ఇటువంటి అవకాశం మళ్లీ రాదు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ టెక్నికల్, నాన్-టెక్నికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1816 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కొరకు డిసెంబర్ నెలలో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 16 2023 నుంచి ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు 2024, జనవరి 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఐఓసీఎల్ అధికారిక వెబ్ సైట్ https://iocl.com/ ను పరిశీలించాలి.

ముఖ్య సమాచారం :

  • మొత్తం అప్రెంటిస్ పోస్టులు:
  • 1816

రాష్ట్రాలవారీగా ఖాళీలు:

  • తమిళనాడు & పుదుచ్చేరి-30, కర్ణాటక-20, మహారాష్ట్ర-252, గుజరాత్-95, గోవా-06, మధ్యప్రదేశ్-52, ఛత్తీస్‌గఢ్-24, డామన్ & డయ్యూ-03, దాద్రా & నగర్ హవేలీ-02, పశ్చిమ్‌ బెంగాల్-252, బిహార్-87, ఒడిశా-87, ఝార్ఖండ్-41, అసోం-115, సిక్కిం-04, అండమాన్ & నికోబార్-05, త్రిపుర-06, నాగాలాండ్-03, మిజోరం-01, మేఘాలయ-01, మణిపూర్-04, అరుణాచల్ ప్రదేశ్-04, ఢిల్లీ-138, హరియాణా-82, పంజాబ్-76, చండీగఢ్-14, హిమాచల్ ప్రదేశ్-19, జమ్ము అండ్‌ కశ్మీర్‌-17, ఉత్తర్‌ప్రదేశ్-256, రాజస్థాన్-96, ఉత్తరాఖండ్-24.

ట్రేడులు:

  • టెక్నీషియన్ అప్రెంటిస్- మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్
  • ట్రేడ్ అప్రెంటిస్(టెక్నికల్ అండ్ నాన్-టెక్నికల్)- ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్

వయోపరిమితి :

  • 2023 నవంబర్ 30 నాటికి అభ్యర్థులు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులతో పాటు దివ్యాంగులకు కొన్ని వయోపరిమితి సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • అభ్యర్థులు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం :

  • డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్,రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తుల ప్రారంభ తేదీ :

  • 16-12-2023

దరఖాస్తులకు చివరి తేదీ :

  • 05-01-2024

ఐఓసీఎల్ అధికారిక వెబ్ సైట్:

Show comments