టెన్త్, ITI అర్హతతో ఒంగోలు GGHలో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి

నిరుద్యోగులకు శుభవార్త. టెన్త్, ఇంటర్ అర్హతతో ఒంగోల్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు గడువు ఇంకొన్ని రోజుల్లో ముగియనున్నది. వెంటనే అప్లై చేయండి.

నిరుద్యోగులకు శుభవార్త. టెన్త్, ఇంటర్ అర్హతతో ఒంగోల్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు గడువు ఇంకొన్ని రోజుల్లో ముగియనున్నది. వెంటనే అప్లై చేయండి.

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే పట్టుదలతో ఉన్న వారికి ఇదే మంచి తరుణం. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. మీరు కన్న కలలను, కన్న వారి ఆశలను నెరవేర్చేందుకు ఇదొక గొప్ప అవకాశం. అంకితభావంతో కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి జీవితంలో సెటిల్ అయిపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సంబంధిత ప్రక్రియ ప్రారంభమైంది. కాగా ఏపీలోని నిరుద్యోగులకు మరో శుభవార్తను అందించింది ఒంగోలు జీజీహెచ్. వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాల నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాల- కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ వైద్య సంస్థల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 298 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ప్రకాశం జిల్లా అధికారిక వెబ్ సైట్ ను https://prakasam.ap.gov.in/ పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

  • మొత్తం ఉద్యోగాలు:
  • 298

పోస్టుల వారీగా ఖాళీలు:

  • అనస్థీషియా టెక్నీషియన్: 10
  • అటెండర్/ఆఫీస్ సబార్డినేట్: 36
  • ఆడియో విజువల్ టెక్నీషియన్: 01
  • ఆడియోమెట్రిక్ టెక్నీషియన్: 01
  • బయోమెడికల్ టెక్నీషియన్: 03
  • కార్డియాలజీ టెక్నీషియన్: 03
  • చైల్డ్ సైకాలజిస్ట్: 01
  • క్లినికల్ సైకాలజిస్ట్: 01
  • కంప్యూటర్ ప్రోగ్రామర్: 01
  • డార్క్ రూమ్ అసిస్టెంట్: 01
  • డెంటల్ టెక్నీషియన్: 01
  • డయాలసిస్ టెక్నీషియన్: 01
  • ఈసీజీ టెక్నీషియన్: 04
  • ఎలక్ట్రికల్ హెల్పర్: 03
  • ఎలక్ట్రీషియన్/మెకానిక్: 01
  • ఎలక్ట్రీషియన్ Gr-III: 05
  • ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 35
  • ఎఫ్ఎన్ఓ: 04
  • జనరల్ డ్యూటీ అటెండెంట్: 61
  • జూనియర్ అసిస్టెంట్/JA- కంప్యూటర్ అసిస్టెంట్: 33
  • ల్యాబ్ అటెండెంట్: 18
  • ల్యాబ్ టెక్నీషియన్ Gr-II: 20
  • లైబ్రరీ అసిస్టెంట్: 04
  • మెడికల్ రికార్డ్ టెక్నీషియన్: 02
  • ఎంఎన్ఓ: 03
  • మార్చురీ అటెండర్: 07
  • నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్: 01
  • ఆప్టోమెట్రిస్ట్: 01
  • ప్యాకర్: 01
  • ఫార్మసిస్ట్ Gr-II: 09
  • ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ (PET): 01
  • ఫిజియోథెరపిస్ట్: 02
  • ప్లంబర్: 04
  • సైకియాట్రిక్ సోషల్ వర్కర్: 01
  • రిఫ్రాక్షనిస్ట్: 01
  • స్పీచ్ థెరపిస్ట్: 01
  • స్టోర్ అటెండర్: 04
  • స్ట్రక్చర్ బేరర్ బాయ్: 01
  • సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 01
  • ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్: 05
  • టైపిస్ట్/డేటా ఎంట్రీ ఆపరేటర్: 01
  • రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్: 01
  • హౌస్‌కీపర్/వార్డెన్స్: 02

అర్హత:

  • అభ్యర్థులు పోస్టును అనుసరించి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ:

  • విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్‌ లైన్‌ దరఖాస్తులను ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరితేది:

  • 06-01-2024.

ప్రకాశం జిల్లా అధికారిక వెబ్ సైట్:

Show comments