Nidhan
రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో ఏ భారత బ్యాటర్ వల్ల కూడా కానిది సాధించి చూపించాడు.
రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో ఏ భారత బ్యాటర్ వల్ల కూడా కానిది సాధించి చూపించాడు.
Nidhan
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బోణీ కొట్టింది. ఐపీఎల్-2024లో తొలి విజయాన్ని నమోదు చేసింది డుప్లెసిస్ సేన. సీఎస్కే చేతిలో ఓడి నిరాశలో ఉన్న ఆర్సీబీ.. రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లు ఆడి 176 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన బెంగళూరు ఇంకో 4 బంతులు ఉండగానే టార్గెట్‌ను అందుకుంది. ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ (77), దినేష్ కార్తీక్ (28 నాటౌట్) దుమ్మురేపారు. కోహ్లీ ఇన్నింగ్స్‌ను నిలబెడితే.. కార్తీక్ మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. విరాట్ గనుక ఓ ఎండ్‌లో నిలబడకపోతే మ్యాచ్ ఎప్పుడో ముగిసిపోయేది. తన ఎక్స్‌పీరియెన్స్ మొత్తాన్ని బయటకు తీసిన కింగ్ బెంగళూరుకు విజయాన్ని అందించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
రికార్డుల రారాజు విరాట్ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్లో ఇప్పటిదాకా ఏ భారత బ్యాటర్‌కూ సాధ్యం కానిది తాను చేసి చూపించాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేయడం ద్వారా టీ20ల్లో 100 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. పొట్టి ఫార్మాట్లో ఓ ఇండియన్ బ్యాటర్ కూడా ఇలా వందసార్లకు పైగా 50 ప్లస్ స్కోర్లు చేయలేదు. ఈ అరుదైన రికార్డుతో పాటు ఇదే మ్యాచ్‌లో మరికొన్ని ఘనతలు అందుకున్నాడు కోహ్లీ. పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో జానీ బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్నాడు కింగ్. ఈ క్యాచ్ ద్వారా టీ20 క్రికెట్ హిస్టరీలో భారత తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా (172 క్యాచ్‌లు) ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
టీ20ల్లో అత్యధిక క్యాచుల విషయంలో రైనాను అధిగమించిన కోహ్లీ ప్రస్తుతం 173 క్యాచ్‌లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ లిస్ట్‌లో రోహిత్ శర్మ (167 క్యాచ్‌లు) మూడో స్థానంలో ఉన్నాడు. మనీష్ పాండే (146 క్యాచ్‌లు), సూర్యకుమార్ యాదవ్ (136 క్యాచ్‌లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్లో మరో రికార్డును కూడా కోహ్లీ తన పేరు మీద లిఖించుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 175 ప్లస్ స్కోర్లను ఛేజ్ చేసిన సమయాల్లో 50 ప్లస్ స్కోర్లు ఎక్కువ సార్లు బాదిన బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు. ఇలా ఒకే మ్యాచ్‌తో పలు రికార్డులను నమోదు చేశాడు కింగ్. అలాగే ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో ఆరెంజ్ క్యాప్నూ అందుకున్నాడు. ఐపీఎల్-2024లో కోహ్లీ (98 పరుగులు) లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. అతడి తర్వాత ప్లేసుల్లో సామ్ కర్రన్ (86), సంజూ శాంసన్ (82), శిఖర్ ధావన్ (67), ఆండ్రీ రస్సెల్ (64) ఉన్నారు. మరి.. కోహ్లీ అరుదైన రికార్డులపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ కు గుడ్ న్యూస్! మెరుపు బౌలర్ ఎంట్రీ!
Virat Kohli becomes the first Indian to score 100 fifty plus scores in T20 cricket….!!!! 🫡🐐 pic.twitter.com/sDI494PIJm
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 25, 2024