బుద్ధి మార్చుకోని హార్దిక్.. రోహిత్​ చేసిన సాయాన్ని మర్చిపోయి..!

ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోమారు ట్రోలింగ్​కు గురయ్యాడు. రోహిత్ శర్మ చేసిన సాయాన్ని అతడు మర్చిపోవడమే దీనికి కారణమని చెప్పాలి.

ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోమారు ట్రోలింగ్​కు గురయ్యాడు. రోహిత్ శర్మ చేసిన సాయాన్ని అతడు మర్చిపోవడమే దీనికి కారణమని చెప్పాలి.

ఐపీఎల్-2024 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడియెన్స్​ మరికొన్ని గంటలు ఆగితే చాలు. శుక్రవారం నుంచి పొట్టి లీగ్ సందడి మొదలుకానుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్​తో క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్​కు తెరలేవనుంది. ఈసారి ట్రోఫీ మీద కన్నేసిన ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్​లో గుజరాత్ టైటాన్స్​ను ఎదుర్కోనుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఆదివారం జరగనుంది. దీంతో ప్రిపరేషన్స్​లో మరింత వేగం పెంచింది ముంబై టీమ్. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తదితరులు జోరుగా ప్రాక్టీస్​ చేస్తున్నారు. ఈ తరుణంలో పాండ్యాపై మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. హార్దిక్​ బుద్ధి మారలేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ విమర్శిస్తున్నారు.

పాండ్యా మీద ట్రోలింగ్​కు కారణం రోహిత్​ చేసిన సాయాన్ని అతడు విస్మరించడమే. ఇవాళ్టి నుంచి ఐపీఎల్ కొత్త సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో తాజాగా హార్దిక్ ట్విట్టర్​లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ఇది తనకు 10వ ఐపీఎల్ సీజన్ అని.. ఇంతవరకు సాగిన ఈ జర్నీలో తనకు సహకరించిన వారికి, తాను ఈ స్థాయికి ఎదగడంలో కీలకపాత్ర పోషించిన వారికి రుణపడి ఉంటానన్నాడు. తన హృదయానికి ఎంతో దగ్గరగా ఉండే ముంబై ఇండియన్స్​లోకి మళ్లీ రావడం చాలా సంతోషంగా ఉందన్నాడు పాండ్యా. ఐపీఎల్ వల్లే ఇంత గుర్తింపు దక్కిందని లేకపోతే బరోడాలోనే తాను ఉండిపోయేవాడ్ని అని హార్దిక్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ పోస్టులో గానీ వీడియోలో గానీ ఎక్కడా రోహిత్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు పాండ్యా.

టీమ్​లో అనామకుడిగా ఉన్న హార్దిక్​కు అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేశాడు హిట్​మ్యాన్. తాను కెప్టెన్​గా ఉన్నప్పుడు పాండ్యా పదే పదే ఫెయిలైన సమయంలో అతడ్ని వదులుకునేందుకు ఫ్రాంచైజీ సిద్ధమైంది. ఆ టైమ్​లో కూడా హార్దిక్​ టాలెంట్​పై నమ్మకం ఉంచి అతడ్ని టీమ్​లో కంటిన్యూ అయ్యేలా చేశాడు. ఐపీఎలే కాదు టీమిండియాలో కూడా అతడి ప్లేస్ ఫిక్స్ అవడంలో హిట్​మ్యాన్ కీలకపాత్ర పోషించాడు. అయినా తన పోస్టులో, వీడియోలో ఐపీఎల్ వల్లే ఈ స్థాయిలో ఉన్నానని అన్నాడు. కానీ ఎక్కడా రోహిత్​ ప్రస్తావన తీసుకురాలేదు పాండ్యా. అతడి పేరు చెప్పి కృతజ్ఞతలు చెప్పి ఉంటే బాగుండేది.

రోహిత్ ప్రస్తావన తీసుకొస్తే ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషించేవారు. అలాగే తనకు ఇచ్చిన సపోర్ట్​కు హార్దిక్ రుణం తీర్చుకున్నట్లు ఉండేది. కానీ పాండ్యా అలా చేయకపోవడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. హార్దిక్ బుద్ధి మారలేదని.. రోహిత్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాననే విషయం అతడు మర్చిపోయాడని అంటున్నారు. కెప్టెన్సీ విషయంలో అవమానించిందే గాక ఇప్పుడు క్రెడిట్స్ ఇవ్వకుండా, కనీసం హిట్​మ్యాన్ పేరెత్తకుండా తన నీచ బుద్ధి మరోమారు చూపించుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రోహిత్-హార్దిక్ వ్యవహారంపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments