P Krishna
Nepal Plane Crash: తక్కువ సమయంలో సుదూర ప్రాంతాలకు చేరుకోవాలంటే విమానాలను ఆశ్రయిస్తుంటారు. ఇటీవల విమాన ప్రయాణాలు చేయాలంటే భయపడే పరిస్థితి నెలకొందని అంటున్నారు ప్రయాణికులు. తరుచూ విమాన ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి.
Nepal Plane Crash: తక్కువ సమయంలో సుదూర ప్రాంతాలకు చేరుకోవాలంటే విమానాలను ఆశ్రయిస్తుంటారు. ఇటీవల విమాన ప్రయాణాలు చేయాలంటే భయపడే పరిస్థితి నెలకొందని అంటున్నారు ప్రయాణికులు. తరుచూ విమాన ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి.
P Krishna
ఇటీవల ఆకాశ మార్గాన పయణిస్తున్న విమానాల్లో భద్రత లేకుండా పోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక కారణాలు..ఇతర లోపాల వల్ల ప్రమాదానికి గురవుతున్నాయి.. పైలట్లు సమయస్పూర్తి ప్రదర్శించి సురక్షితంగా ల్యాండ్ చేసి రక్షిస్తున్నారు.కానీ కొన్ని సమయాల్లో మాత్రం ప్రమాదాల్లో ఎంతోమంది ప్యాసింజర్లు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.2023లో పోఖారా నుండి ఖాట్మండుకు వెళ్లున్న ఏతి ఎయిర్‌లైన్స్ విమానం కూలి 72 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రమాదం దిగ్బ్రాంతికి గురి చేసింది. తాజాగా నేపాల్ లో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళితే..
నేపాల్ రాజధాని ఖాట్మండు లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బుధవారం రాజధాని ఖాట్మండు విమానాశ్రయం నుంచి టేకాఫ్ కు ప్రయత్నిస్తుండగా రన్ వే నుంచి జారిపడి కుప్పకూలిపోయింది. ఇందులో సిబ్బందితో సహా 19 మంది చనిపోయినట్లు భావిస్తున్నారు అధికారులు.విమానంలో కొంతమంది సాంకేతిక సిబ్బంది ఉన్నట్లు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (టీఐఏ) సమాచార అధికారి జ్ఞానేంద్ర భూల్ హిమాలయన్ వెల్లడించారు. విమానం కుప్పకూలిపోగానే మంటలు.. దట్టమైన పొగ అల్లుకొంది. అగ్ని మాపక, భద్రతా సిబ్బంది హుటా హుటిన స్పాట్ కి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. దేశీయ శౌర్య విమానయాన సంస్థకు చెందిన విమానం నేపాలీ రాజధాని నుంచి రిసార్ట్ పట్టణం పోఖారాకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
#WATCH | Plane crashes at the Tribhuvan International Airport in Nepal’s Kathmandu
Details awaited pic.twitter.com/DNXHSvZxCz
— ANI (@ANI) July 24, 2024