బంపర్ ఆఫర్‌ బ్రో.. ఉచితంగా మేకల పంపిణీ..! ఎక్కడంటే..?

బంపర్ ఆఫర్‌ బ్రో.. ఉచితంగా మేకల పంపిణీ..! ఎక్కడంటే..?

వివిధ సమస్యలను నియంత్రించేందుకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. అలానే ఓ ప్రభుత్వం కూడా స్థానిక ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించి..తమ సమస్య నివారణకు చర్యలు తీసుకుంది. ఉచితంగా మేకల పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టుంది. మరి.. ఆ వివరాలు..

వివిధ సమస్యలను నియంత్రించేందుకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. అలానే ఓ ప్రభుత్వం కూడా స్థానిక ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించి..తమ సమస్య నివారణకు చర్యలు తీసుకుంది. ఉచితంగా మేకల పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టుంది. మరి.. ఆ వివరాలు..

మార్కెట్ లో వస్తువుల కొనుగోల విషయంలో అనేక రకాల ఆఫర్లను మనం చూస్తూనే ఉంటాము. అలానే కొన్ని సార్లు ఉచితం అనే ఆఫర్లు కూడా మనకు కనిపిస్తూనే  ఉంటాయి. అలానే వివిధ ప్రభుత్వాలు కూడా ప్రజలకు అనేక రకాల బంపర్ ఆఫర్లు ఇస్తుంటాయి. ఏకంగా ఉచితంగా టీవీలు, ల్యాప్ ట్యాప్  లు వంటివి ఇస్తుంటాయి. అలానే ఓ ప్రాంతంలో ఉచితంగా మేకలను పంపిణీ చేస్తున్నారంట. అది కూడా ఒక్కొక్కరికి 50 వరకు ఇస్తారనే టాక్. మరి.. ఆ ప్రాంతం ఎక్కడ, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏదైనా ఓ పరిస్థితి నియంత్రించలేని స్థితికి చేరినప్పుడు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. అలానే ఇటాలియన్‌ లోని అలికుడి అనే చిన్న ద్వీపం కూడా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ ద్వీపంలో తీసుకున్న కీలక నిర్ణయం తెలుసుకునే ముందు.. ఆ దేశం గురించి కాస్తా తెలుసుకుందాం. ఈ అలికుడి ద్వీపంలో జనాబా 100 మంది మాత్రమే ఉన్నారు.  సిసిలీ, ఇటలీ ప్రధాన భూభాగంలో ఉన్న అయోలియన్ దీవుల సమూహంలోని ఏడు ద్వీపాలలో అలికుడి ఒకటి. ఇది  ఆ ద్వీపాల్లో అత్యంత ఒంటరిగా, తక్కువ జనాభా ఉన్న ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఫెర్రీ రాకపోకలు, గాడిదల శబ్దం తప్ప మరెలాంటి కాలుష్యం ఉండదు. ఈ ప్రాంతంలో గాడిదలు ప్రధాన రవాణా సాధనంగా పనిచేస్తాయి.

కానీ ఇక్కడ ఓ విచిత్రమైన సమస్య వచ్చిందంట. ఇక్కడ మేకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కేవలం 100 మంది జనాభా కలిగిన ఈ ద్వీపంలో 600కి పైగా మేకలు స్వేచ్ఛగా తిరుగుతాయట. దీంతో మనుషుల కంటే ఎక్కువగా ఈ దీవిని ఇప్పుడు మేకలు ఆక్రమించుకుంటున్నాయి. సమస్య పరిష్కారానికి స్థానిక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ప్రజలకు మేకలను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందంట. అవసరమైన వారికి ఉచితంగా మేకలను ఇస్తుంది అలికుడి ద్వీపంలోని ప్రభుత్వం. మేకల సంఖ్య విపరీతంగా పెరగడంతో అక్కడి అధికారులు ఆ చర్యకు ముందుకు వచ్చారు. సుమారు ఒక్కొక్కరి 50 వరకు మేకలు ఇస్తారంట.

అసలు ఇక్కడ ఈ భారీ స్థాయిలో మేకల సంఖ్య పెరగడానికి గల కారణం గురించి ఓ వార్త ప్రచారంలో ఉంది. అలికుడి ద్వీపానికి చెందిన ఓ రైతు తొలిసారిగా మేకలను తీసుకొచ్చాడు. మొదట్లో కొండలు, కొండ చరియల పైభాగంలో ఇవి ఉండేవి. కాలక్రమేణా మేకల సంఖ్య పెరగడంతో జనాలు ఉండే ప్రాంతాలకు చేరుకున్నాయి. అంతేకాక అక్కడి తోటలు, ఇతర ప్రాంతాలను ధ్వంసం చేయడం ప్రారంభించాయి. ఈ ధోరణి ప్రజల జీవితాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుందని అక్కడి ప్రభుత్వం భావించింది. దాంతో స్థానిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని “అడాప్ట్ ఎ మేక” అనే ప్రాజెక్ట్ ప్రారంభించారు.

ఈ స్కీమ్ ప్రకారం మేకలను అవసరమైన వారికి ఉచితంగా పంపిణీ చేయటం. మేకల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో వ్యక్తి 50 మేకల వరకు కొనుగోలు చేయవచ్చు. అయితే ఇక్కడ దరఖాస్తు ఫీజు మాత్రం ఉంటుంది. ఏప్రిల్ 10లోపు 1400 రూపాయల స్టాంప్‌తో కూడిన దరఖాస్తును సమర్పించాలి. అర్హులైన అభ్యర్థులు ద్వీపం నుండి మేకలను తీసుకెళ్లవచ్చు. అందు కోసం 15 రోజుల సమయం ఉంటుంది. మేకల సంఖ్య 100కి చేరే వరకు ప్రాజెక్టు కొనసాగుతుందని స్థానిక ప్రభుత్వం ప్రకటించింది.

Show comments