Hyderabadలో విస్తరిస్తున్న వైరల్‌ ఫ్లూ.. ఈ లక్షణాలు కనిపిస్తే.. నిర్లక్ష్యం చేయకండి

Viral Flu: నగరంలో వైరల్‌ ఫ్లూ కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇది ముదిరితే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. వైరల్‌ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయో వివరించడమే కాక.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నారు. ఆ వివరాలు..

Viral Flu: నగరంలో వైరల్‌ ఫ్లూ కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇది ముదిరితే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. వైరల్‌ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయో వివరించడమే కాక.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నారు. ఆ వివరాలు..

వాతావరణం మారడంతోనే వ్యాధులు విజృంభిస్తాయి. ఇక వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ కాలంలో సాధారణ దగ్గు, జలుబు, జ్వరంతో పాటు వైరల్‌ ఫీవర్లు, మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ కేసులు పెరుగుతుంటాయి. వీటికి తోడు కొత్త కొత్త ఇన్‌ఫెక్షన్లు, వైరస్‌లు అటాక్‌ చేస్తుంటాయి. ఈ ఏడాది వర్షకాలం ప్రారంభం అయ్యి పట్టుమని నెల రోజులు కావడం లేదు.. అప్పుడే సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆస్పత్రులకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో నగరంలో గత నాలుగైదు రోజులుగా వైరల్‌ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయని.. మీలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ వివరాలు..

గత వారం రోజులుగా హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో రోజుకు 600-800 వైరల్ ఫ్లూ, సీజనల్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. ఇవి సీజనల్ ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజా, వైరల్ ఇన్‌ఫెక్షన్ల వచ్చే జ్వరాలుగా డాక్టర్లు గుర్తించారు. వీటివల్ల తీవ్రమైన న్యుమోనియాతో పాటు శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడే అవకాశం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) డేటా ప్రకారం.. ఇన్‌ఫ్లూయెంజా ఏ (హెచ్‌1ఎన్‌), ఏ (హెచ్‌3ఎన్‌2) కేసులు పెరుగుతున్నట్లు వెల్లడైంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో రోగవ్యవస్థలో మార్పుల కారణంగా.. సాధారణ ఫ్లూ కూడా ఇప్పుడు శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లకు దారి తీస్తుందని వైద్యులు చెప్పుకొస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

వైరల్‌ ఫ్లూ లక్షణాలు ఇవే..

  • ఇది వాతవరణం మార్పుల కారణంగా వస్తుందని.. జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
  • జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, ఒంటి నొప్పులు, కండ్లకలక, దగ్గు వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని చెబుతున్నారు.
  • మూడు రోజుల కంటే ఎక్కువ కాలం లక్షణాలు కొనసాగితే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు.
  • జ్వరం, తుమ్ములు, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, దగ్గు, శ్వాసతీసుకోవటంలో ఇబ్బంది, ఛాతీలో మంట, శరీర నొప్పులు, నీరసం.
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఫ్లూ యొక్క ముఖ్య లక్షణాలని వైద్యులు చెప్పుకొచ్చారు.

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

  • అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు.
  • వారితో ఆహారం, నీరు, బట్టలు పంచుకోవడం వంటివి చేయకూడదు.
  • తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
  • డోర్ హ్యాండిల్స్, టేబుల్ టాప్‌లు, రెయిలింగ్‌లు వంటి వాటిని తాకటం చేయరాదు.
  • తుమ్మేటప్పుడు, దగ్గుతున్నప్పుడు నోటికి చేతులు, కర్చీఫ్‌  అడ్డు పెట్టుకోవాలి.
  • డిస్పోజబుల్ టిష్యూలను ఉపయోగించాలి. వాడిని తర్వాత వాటిని జాగ్రత్తగా పడేయాలి.

ఆ వ్యాక్సిన్‌ తీసుకుంటే మంచిది

నగరంలో వైరల్‌ ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చిన్న పిల్లలు, వృద్ధులు, గుండె, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు, ఆస్తమా రోగులు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గర్భిణీలకు స్వైన్ ఫ్లూ వంటివి సోకితే.. గర్భస్రావం అయ్యే అవకాశం ఉందంటున్నారు. అంతేకాక ఆసుపత్రుల్లో ‘ఫ్లూ షాట్ వ్యాక్సిన్’ అందుబాటులో ఉంటుందని.. ఏడాదికి ఒక్కసారి ఈ టీకా తీసుకోవాలని చెబుతున్నారు.

Show comments