Crime News: ఎవరీ కాజల్ .. రూ. 80 కోట్ల ఆస్తిని పోలీసులు ఎందుకు సీజ్ చేశారు..?

ఎవరీ కాజల్ .. రూ. 80 కోట్ల ఆస్తిని పోలీసులు ఎందుకు సీజ్ చేశారు..?

తీగ దొరికితే చాలు డొంక కదిలించేస్తారు రక్షక భటులు. పోలీసులు దృష్టిలో నుండి నేరస్థులు తప్పించుకోవడం అంత సాధ్యం కాదూ. ఇప్పుడు ఓ కేసు విషయంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. వాళ్లకు కీలక క్లూ దొరికింది. అంతలో ఓ మహిళకు సంబంధించిన ఆస్తుల్ని సీజ్ చేశారు పోలీసులు.. ఇంతకు ఎవరామే..?

తీగ దొరికితే చాలు డొంక కదిలించేస్తారు రక్షక భటులు. పోలీసులు దృష్టిలో నుండి నేరస్థులు తప్పించుకోవడం అంత సాధ్యం కాదూ. ఇప్పుడు ఓ కేసు విషయంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. వాళ్లకు కీలక క్లూ దొరికింది. అంతలో ఓ మహిళకు సంబంధించిన ఆస్తుల్ని సీజ్ చేశారు పోలీసులు.. ఇంతకు ఎవరామే..?

దక్షిణ భారతదేశంతో పోల్చుకుంటే.. ఉత్తర భారత్‌లో నేరాల రేటు కాస్త ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో రౌడీయిజం, గూండాగిరి చెలాయిస్తుంటారు గ్యాంగ్ స్టర్స్. అక్రమ ఆయుధాలను కలిగి ఉంటారు. గ్యాంగస్టర్, రౌడీలు, గూండాలు ఇల్లీగల్‌గా వాటిని కొనుగోలు చేసి.. అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. దీంతో రానూ రానూ నేరాల సంఖ్య పెరిగిపోయింది. అయితే యుపిలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కొలువు దీరిన నాటి నుండి గ్యాంగస్టర్లను ఏరిపారేసేందుకు కంకణం కట్టుకుంది. ఇప్పటికే అనేక మంది రౌడీ మూకల్ని లేపేసింది. గ్యాంగ్ స్టర్ కనబడితే చాలు కాల్చి పడేస్తుంది.

తాజాగా గ్యాంగ్ స్టర్ మోస్ట్ వాంటెడ్, నటోరస్ క్రిమినల్ రవి కానా అలియాస్ రవి నగర్ పై దృష్టి సారించింది యుపి సర్కార్.  ఓ కేసులో భాగంగా గ్రేట్ నోయిడా పోలీసులు.. అతడికి సంబంధించిన రూ. 100 కోట్ల ఆస్తిని జప్తు చేశారు పోలీసులు. అందులో రూ. 80 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా కూడా ఉంది. ఇంతకు ఆ బంగ్లా ఎవరిది అంటే.. కాజల్ ఝా అనే మహిళది. ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో నిర్మించిన ఇంటిని గ్రేటర్ నోయిడా పోలీసులు సీజ్ చేశారు. ఆ ఇంట్లో మాఫియా గ్యాంగ్‌లో పనిచేస్తున్న కాజల్ ఝా అనే మహిళ నివసిస్తుందని విచారణలో తేలింది. ఇంతకు ఈ కాజల్ ఝా ఎవరు.. ఆమెకు ఈ భవంతి ఎలా వచ్చిందంటే?

కాజల్ ఝా ఎవరంటే..?

కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ రవి గర్ల్ ప్రెండే ఈ కాజల్ ఝా.. ఆ ఇంటిని రవి ఆమెకు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. బార్ అండ్ స్క్రాప్ మాఫియా రవినగర్ (రవికాన) ముఠాపై దృష్టి సారించారు పోలీసులు. ఈ క్రమంలో నగరాల్లో నిరంతర దాడులు చేస్తున్నారు. ఈ గ్యాంగ్ లో ఇద్దరు గ్యాంగ్ స్టర్ల ఆచూకీ తెలియడంతో చర్యలు మొదలు పెట్టారు. ఢిల్లీ, ఘజియాబాద్, డెహ్రాడూన్, పంజాబ్, బులంద్‌షహర్‌లలో ఉన్న ముఠా రహస్య స్థావరాలు, ఆస్తులు, గోదాములను గుర్తించారు పోలీసులు. అందులో భాగంగానే సుమారు రూ.100 కోట్ల ఆస్తులను సీల్ చేయగా.. అందులో కాజల్ ఝా నివసిస్తున్న భవనం కూడా ఉంది.  పోలీసుల వేటలో.. ఈ భవనాన్ని సీజ్ చేశారు.

కాజల్ ఝా.. ఉద్యోగం కోసం వెతుకులాడుతున్న క్రమంలో గ్యాంగ్ స్టర్ రవితో పరిచయం ఏర్పడింది. చివరకు అతని గ్యాంగ్‌లో చేరింది. ఆమె కను సన్నల్లోనే ముఠా వ్యాపారం జరుగుతుంది. గ్యాంగ్ స్టర్లను శాసించే స్థాయికి చేరింది. రవితో సంబంధం ఉన్న మాఫియా గ్యాంగ్‌లోనే కాజల్ ఝా కూడా పని చేస్తోంది. ఇప్పుడు ఈమె ఉండే నివాసాన్నే సీజ్ చేశారు పోలీసులు. అంతే కాకుండా గుర్తించిన రహస్య స్థావరాలపై తర్వలో దాడులు చేయనున్నారు. ఆస్తుల జప్తుతో పాటు ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వీలు లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. రవితో పాటు ఇతర గ్యాంగ్ స్టర్స్ బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశారు. ఏటీఎంతో సహా అన్ని కార్డులను బ్లాక్ చేశారు. మరీ పోలీసులు తీసుకుంటున్న ఈ చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments