భార్య- 10 నెలల బిడ్డను హత్య చేసిన భర్త.. తర్వాత మరో ఘోరం..!

Secunderabad Bowenpally Crime News: సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్ పల్లిలో దారుణం జరిగింది. ఓ భర్త తన భార్య- 10 నెలల వయసున్న చిన్నారిని దారుణంగా హత్య చేశాడు. ఆ విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి మరీ సమాచారం ఇచ్చాడు.

Secunderabad Bowenpally Crime News: సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్ పల్లిలో దారుణం జరిగింది. ఓ భర్త తన భార్య- 10 నెలల వయసున్న చిన్నారిని దారుణంగా హత్య చేశాడు. ఆ విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి మరీ సమాచారం ఇచ్చాడు.

ఈరోజుల్లో సంసారాలు ఎంత దారుణంగా తయారు అవుతున్నాయి అంటే.. చిన్న అనుమానంతో ప్రాణాలు తీసేస్తున్నారు. కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను కూడా కనికరం లేకుండా కాటికి పంపేస్తున్నారు. ఇలాంటి ఒక ఘోరం సికింద్రాబాద్ పరిధిలో వెలుగు చూసింది. ఓ భర్త తన భార్యపై అనుమానంతో ఆమెను మాత్రమే కాకుండా.. తన 10 నెలల బిడ్డను కూడా కనికరం లేకుండా హతమార్చాడు. అంతేకాకుండా ఆ విషయాన్ని తానే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. నేను.. నా భార్య- 10 నెలల బిడ్డను చంపేశాను అని సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత అతను మరో ఘోరానికి పాల్పడ్డాడు.

ఈ ఘటన సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్- స్వప్న మహారాష్ట్రకు చెందిన వాళ్లు. వారు గత నాలుగు నెలలుగా బోయిన్ పల్లిలో నివాసం ఉంటున్నారు. గణేశ్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతనికి 10 నెలల పాప సహా ముగ్గురు సంతానం ఉంది. అయితే భార్యపై గణేశ్ కు అనుమానం ఏర్పడింది. ఆఖరి పాప తనకు పుట్టలేదు అనేది గణేశ్ మదిలో ఉన్న అనుమానం. ఎన్ని రోజులుగా ఆమెపై పగను పెంచుకున్నాడో తెలియదు. ఆమెను- ఆ 10 నెలల పాపను దారుణంగా హత్య చేశాడు. అక్కడితో ఆగకుండా తన 10 నెలల చిన్నారిని కూడా చంపేశాడు. ఆ తర్వాత ఆ సమాచారాన్ని పోలీసులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు.

తర్వాత గణేశ్ అల్వాల్ లోని రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు. హత్యల గురించి సమాచారం ఇవ్వడమే కాకుండా.. తాను మరికొద్దిసేపటిలో రైలు కింద పడబోతున్నాను అని కూడా సమాచారం ఇచ్చాడు. గణేశ్ ఉండే ఇంటికి చేరుకున్న పోలీసులు అక్కడ ఉన్న స్వప్న- 10 నెలల చిన్నారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరికి మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో ఆ ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు. ఈ విషయంపై ప్రత్యక్ష సాక్షి సువర్ణ అనే మహిళ మీడియాతో మాట్లాడింది. “ఉదయం 4 గంటల ప్రాంతంలో గణేశ్ బయటకి వెళ్తూ నాకు కనిపించాడు. గణేశ్ వాళ్ల అన్న- అమ్మకు ఫోన్ చేసి మాట్లాడమని చెప్పాడు. స్వప్న వాళ్ల కుటుంబానికి ప్రమాదం జరిగిందని.. ఆ విషయాన్ని అప్పుడే చెప్పొద్దని చెప్పాడు. స్వప్న వాళ్లు అమ్మ ఫోన్ నంబర్ ఇంట్లో ఉందని తెలిపాడు.

తర్వాత వారికి ఫోన్ చేసి చెప్పమన్నాడు. అయితే ఇంత ఘోరం జరుగుతుందని నేను అనుకోలేదు. ఎప్పుడు కనిపించినా మాట్లాడి వెళ్తాడు. ఈరోజు కూడా అలాగే అనుకున్నాను. కానీ, ఇలాంటి ఘోరం జరిగిపోయింది” అంటూ సువర్ణ అనే మహిళ చెప్పుకొచ్చింది. కారణం ఏదైనా హత్యలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. అంతగా భార్యాభర్తలకు పొరపొచ్చాలు వస్తే.. విడాకులు తీసుకునే అవకాశం కూడా ఉందనే విషయాన్ని మర్చిపోకూడదు. అంతేకాకుండా.. కడుపున పుట్టిన పిల్లలను కూడా ఇలా కడతేర్చడం మంచి విషయం అయితే కాదు. గణేశ్ చేసిన ఈ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments