హైదరాబాద్ లో దారుణం..యువతిపై కారులో గ్యాంగ్ రే*ప్!

బుధవారం హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతికి మాయమాటలు చెప్పి.. కార్లు తీసుకెళ్లి.. అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక ఈ ఘటనకు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బుధవారం హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతికి మాయమాటలు చెప్పి.. కార్లు తీసుకెళ్లి.. అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక ఈ ఘటనకు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నిత్యం ఏదో ఒక ప్రాంతలో మహిళలపై దాడులు, అఘాత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి నేరాలను నిర్మూలించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా కూడా తరచూ ఏదో ఒక ప్రాంతంలో అమ్మాయిలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఉద్యోగం కోసం వేర రాష్ట్రం నుంచి వచ్చిన యువతిపై ఆమె ఆఫీస్ లో పని చేస్తున్న ఇద్దరు సీనియర్లు దారుణానికి పాల్పడ్డారు.  ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తున్న ఆ యువతిపై సైట్ చూపిస్తామని నమ్మించి తీసుకెళ్లిన ఇద్దరు సీనియర్లు అత్యాచారానికి యత్నించారు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఉప్పల్ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.. జరిగిన విషయం చెప్పగా.. ఘోరం వెలుగులోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడపకు చెందిన  ఓ యువతి ఉద్యోగం కోసం గత నెలలో హైదరాబాద్ కి వచ్చింది. నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో ఆ యువతి నివాసం ఉంటుంది. మియాపూర్ ఉన్న ఓ రియల్ ఎస్టే కంపెనీలో సేల్స్ డిపార్ట్ మెంట్ లో ట్రైనిగా జాయిన్ అయింది. అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌‌లుగా సంగారెడ్డి, జనార్దన్ అనే ఇద్దరు వ్యక్తులు పని చేస్తున్నారు.  యువతి కొత్తగా జాయిన్ కావడంతో..ఆమెకు పని నేర్పిస్తున్నట్లు నటిస్తూ..బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశారు. వాళ్లు నిజంగానే మంచిగా ఉన్నారని, అలానే వర్క్ నేర్పిస్తున్నారని ఆ యువతి కూడా నమ్మి… వాళ్లతో కొంచెం చనువుగా ఉంది.

ఇక యువతి చనువుగా ఉంటడాని అదునుగా తీసుకున్న నిందితులు.. సైట్ విజిట్ కి వెళ్దామంటూ యువతిని కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన తరువాత..మాటల్లో పెట్టి, మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగించారు. అనంతరం యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తనకు అనారోగ్యంగా ఉందని వేడుకున్నా వినకుండా నాలుగు గంటలపాటు కారులోనే వేధింపులకు గురి చేశారని బాధితురాలు తెలిపింది. అత్యాచారం అనంతరం బాధితురాలిని హాస్టల్ ముందు వదిలేసి వెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఇచ్చింది.

బాధితురాలు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్‌ఐఆర్ కింద కేసు నమోదు చేసి.. అక్కడి నుంచి మియాపూర్‌కు పంపించారు. సదరు రియల్ ఎస్టేస్ కంపెనీ వైస్ ఛైర్మన్ సంగారెడ్డి, ఉద్యోగి జనార్ధన్‌లను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగం కోసం ఎక్కడెక్కడి నుంచో యువతులు నగరాలకు వస్తుంటారు. కష్టపడి ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు తెచ్చుకోగా.. అక్కడ కొందరు కామాంధులు వాళ్లపై కన్నేసి.. దారుణాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా.. ఇప్పటికీ కొంత మంది తల్లిదండ్రులు.. తమ బిడ్డలను ఉద్యోగానికో, చదువుకోటానికి నగరంకి పంపించేందుకు భయపడుతున్నారు. ఇలాంటి కామాంధులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Show comments