Arjun Suravaram
నేటి కాలంలో పెద్ద మనుషుల ముసుగులో గలీజు పనులు చేసే వారు పెరిగిపోయారు. అంతేకాక ప్రేమ పేరుతో అమాయకపు బాలికలను మోసం చేసి.. వారి జీవితాన్ని నాశనం చేశారు. తాజాగా ఓ స్కూల్ బస్సు డ్రైవర్ ప్రేమకు ఓ బాలిక బలైంది.
నేటి కాలంలో పెద్ద మనుషుల ముసుగులో గలీజు పనులు చేసే వారు పెరిగిపోయారు. అంతేకాక ప్రేమ పేరుతో అమాయకపు బాలికలను మోసం చేసి.. వారి జీవితాన్ని నాశనం చేశారు. తాజాగా ఓ స్కూల్ బస్సు డ్రైవర్ ప్రేమకు ఓ బాలిక బలైంది.
Arjun Suravaram
ప్రేమ.. రెండు అక్షరాల ఈ పదం ఎంతో బలమైనది. దీని కారణంగా జరిగిన ఎన్నో అద్భుతమైన ఘటనల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ప్రేమ అంటే.. మనిషిని, మనిషిని అర్థం చేసుకుని ఒక్కటి అయ్యేందుకు ఉపయోగపడేది. కానీ నేటికాలంలో ప్రేమకు అర్థం మారుతుంది. కేవలం శరీరంపై ఆకర్షణతో, వ్యామోహంతో మాత్రమే ఏర్పడుతున్న ప్రేమలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. మంచి బుద్దులు చెప్పాల్సిన వారే.. ప్రేమ పేరుతో ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా ఓ స్కూల్ బస్సు డ్రైవర్ ప్రేమకు 14 ఏళ్ల బాలిక బలైంది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు ప్రాంతం గిరియాపూర్ గ్రామానికి చెందిన జానవి(14) తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది. ఇక అమ్మాయి రోజు స్కూల్ కి సురక్షితంగా వెళ్లి రావాలని.. పాఠశాల బస్సులోనే పంపించేది. ఇలా జానవి రోజు స్కూల్ కి బస్సులో వెళ్లి వచ్చేది. అదే స్కూల్ లో సంతోష్ (38) అనే వ్యక్తి మూడేళ్ల నుంచి బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతడు తన కుమార్తె వయస్సు గల జానవిపై మనస్సు పడ్డాడు. ఇక ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించేవాడు.
ఈ విషయాన్ని విద్యార్థిని తన తల్లిదండ్రులకు ఇంట్లో చెప్పింది. వెంటనే జానవి తల్లిదండ్రులు కూడా బస్సు డ్రైవర్ వేధింపులపై స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా సంతోష్ బుద్ది మార్చుకోలేదు. చివరకు ఆ విద్యార్థిని స్నేహం అంటూ దగ్గరకు పిలిచి సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న జానవి తన స్నేహితులతో కలిసి కొత్త ఏడాది వేడుకలు జరుపుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అదే సమయంలో సంతోష్, ఆమెను వాకింగ్ అని బయటకు తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం అర్థరాత్రి సమయంలో సంతోష్, తన వెంట తీసుకెళ్లిన జానవితో పాటు రైలుకు ఎదురుగా నిలబడి మృతి చెందాడు.
అయితే ఈ ఘటన ఎవరూ చూడకపోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సు డ్రైవర్‌పై ఫిర్యాదు చేసినా పాఠశాల యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే తమ బిడ్డ బలైందని మృతురాలి తల్లిదండ్రులు పాఠశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే ట్రాక్ దగ్గర చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిక్కమగళూరులోని మల్లగౌడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా అజ్జంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. మరి…ప్రేమ పేరుతో పసిపిల్ల జీవితాన్ని నాశనం చేసే ఇలాంటి పశువులను ఏ విధంగా శిక్షించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.