వీడియో: సోదరుడిని ట్రాక్టర్ తో తొక్కించిన వ్యక్తి!

వీడియో: సోదరుడిని ట్రాక్టర్ తో తొక్కించిన వ్యక్తి!

ప్రస్తుతం జరుగుతున్న అనేక హత్యల్లో ఎక్కువగా ఆర్థిక, అక్రమ సంబంధం కారణంగా జరుగుతున్నాయి. ఆస్తుల కోసం అయినవారిని చంపే రోజులు వచ్చాయి. ముఖ్యంగా భూమికి సంబంధించి అన్నదమ్ముల గోడవలు జరుగుతుంటాయి. తాజాగా ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది.

ప్రస్తుతం జరుగుతున్న అనేక హత్యల్లో ఎక్కువగా ఆర్థిక, అక్రమ సంబంధం కారణంగా జరుగుతున్నాయి. ఆస్తుల కోసం అయినవారిని చంపే రోజులు వచ్చాయి. ముఖ్యంగా భూమికి సంబంధించి అన్నదమ్ముల గోడవలు జరుగుతుంటాయి. తాజాగా ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది.

నేటికాలంలో రక్త సంబంధాలు అనేవి కనుమరుగైపోతున్నాయి. రక్తం పంచుకుని పుట్టిన వారి కంటే.. ఆస్తులు, డబ్బులకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే..మనం చస్తే..మనతో పాటు రానీ వాటి కోసం.. మనతో పాటు ప్రేమానురాగాలు పంచుకునే వారిపై క్రూరత్వం ప్రదర్శిస్తున్నాం. ముఖ్యంగా భూవివాదల కారణంగా ఎన్నో దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. సొంత అన్నాదమ్ముల్లే ఒకరిపైమరోకరు దాడులు చేసుకుంటున్నారు. అంతేకాక చంపేస్తున్న ఘటనలు కూడా అనేకం జరిగాయి. తాజాగా ఓ వ్యక్తి తన సోదరుడిని ట్రాక్టర్ తో తొక్కించారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం..

ఉత్తర్ ప్రదేశ్ లోని సహరాన్ పూర్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. సహరాన్ పూర్ ప్రాంతంలోని తివాయా గ్రామం ఉంది. అక్కడ ఇద్దరు సోదరులు తమ తమ కుటుంబాలతో నివాసం ఉంటున్నారు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. తరచూ ఓ స్థలం విషయంలో ఇరు కుటుంబాలు గొడవ పడుతుండేవి. అలానే తాజాగా మరోసారి ఈ రెండు కుటుంబాలు  గొడవకు దిగాయి. ఈ క్రమంలోనే సోదరుడు ట్రాక్టర్ తీసుకొచ్చి.. మరోసోదరుడిపైకి ఎక్కించే ప్రయత్నం చేశాడు. సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన దాని ప్రకారం చూసినట్లు అయితే.. నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని అకస్మాత్తుగా అతని సోదరుడు ట్రాక్టర్ ఢీకొట్టడాడు.

దీంతో అతడు ట్రాక్టర్ కింద ఇరుకుపోయాడు. వెంటనే తేరుకుని ట్రాక్టర్ కింద నుంచి బయటకు వచ్చాడు. అతను ట్రాక్టర్ కింద నుండి బయటపడటం, సంఘటన స్థలం నుండి దూరంగా కుంటుతూ బయటకు వచ్చాడు. గొడవ సమయంలో ట్రాక్టర్ వెనుక వైపు ఉన్న సోదరుడు తన తోడబుట్టిన వాడి భార్యపై కూడా దాడి చేశాడు. సంఘటన ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్  అయింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈవివాదానికి అసలు కారణం ఏమిటనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు రక్త సంబంధాలు అనేవి కనుమరుగై పోతున్నాయి అనే భావన కలిగింది. మరి.. ఇలాంటి దారుణ ఘటనల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments