జెట్‌ ఎయిర్‌వేస్‌ అధినేత నరేశ్‌ గోయల్‌ అరెస్ట్‌!

జెట్‌ ఎయిర్‌వేస్‌ అధినేత నరేశ్‌ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కింద ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. మనీల్యాండరింగ్‌కు సంబంధించి బ్యాంకు మోసంపై ఆయన్ని శుక్రవారం ఈడీ అధికారులు ముంబైలోని ఆఫీసుకు పిలిపించారు. కొన్ని గంటల పాటు ఆయన్ని విచారించారు. విచారణ అనంతరం నరేశ్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ రోజు ఆయన్ని ముంబైలోని స్పెషల్‌ పీఎమ్‌ఎల్‌ఏ కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.

కాగా, గతంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ అధినేత నరేశ్‌ గోయల్‌ కెనరా బ్యాంకు దగ్గరినుంచి కొన్ని వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. ఈ డబ్బులకు సంబంధించి నరేశ్‌ మోసానికి పాల్పడ్డారని కెనరా బ్యాంకు గత సంవత్సరం నవంబర్‌ నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనతో పాటు ఆయన భార్య అనిత, గౌరవ్‌ శెట్టి.. మరికొంత మంది ప్రభుత్వ అధికారులపై కూడా కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో సీబీఐ గత మే నెలలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది.

2021, మే 29న ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఓ అప్‌డేట్‌ ఇచ్చింది. నరేశ్‌ గోయల్‌ మోసానికి పాల్పడ్డు తేల్చింది. నరేశ్‌ గోయల్‌ మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు స్పష్టం చేసింది. జిల్‌పై కెనరా బ్యాంకు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరపగా.. ఇతర కంపెనీలకు 1,410 కోట్ల రూపాయలు చెల్లించినట్లు జిల్‌ చూపింది. వివిధ కంపెనీల పేరిట జిల్‌ పెద్ద మొత్తంలో అవకతవకలకు పాల్పడింది. దీన్ని గుర్తించిన బ్యాంకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరి, బ్యాంకును మోసం చేసి జైలు పాలైన జెట్‌ ఎయిర్‌వేస్‌ అధినేత నరేశ్‌ గోయల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments