బ్రేకింగ్‌ : సిద్ధార్థ్‌పై మనోజ్‌ కాల్పులు!

సమాజంలో జనాలకు ఓపిక పూర్తిగా నశించిపోయింది. ఏ విషయానికి ఎలా రియాక్ట్‌ కావాలో వారికి అర్థం కావటం లేదు. సమస్యలు వచ్చినపుడు ప్రాణాలు తీసుకోవటం.. తమకు సమస్యగా మారిన వారి ప్రాణాలు తీయటం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా నిత్యం వేల సంఖ్యలో నేరాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ లాంటి నగరాల్లో అయితే, దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా నిత్యం నేరాలు జరుగుతున్నాయి.

తాజాగా, సిద్ధార్థ్‌ అనే వ్యక్తిపై మనోజ్‌ అనే వ్యక్తి తుపాకితో కాల్పులు జరిపాడు. అదృష్టం బాగుండి బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని శామీర్‌పేటలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సిద్దార్థ్‌ అనే వ్యక్తి శుక్రవారం శామీర్‌పేటలోని సెలబ్రిటీ క్లబ్‌కు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి మనోజ్‌ వచ్చాడు. సిద్ధార్థ్‌పై నిఘా పెట్టాడు. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న తుపాకితో సిద్ధార్థ్‌పై కాల్పులు జరిపాడు. అనంతరం క్లబ్‌నుంచి పరారయ్యాడు.

అయితే, అదృష్టవశాత్తు సిద్ధార్థ్‌కు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. గాయపడ్డ అతడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సిద్ధార్థ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కాల్పులకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments