జిమ్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడు.. పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్‌ విషయాలు!

బాడీ పెంచాలనో.. లేక ఫిట్‌గా ఉండాలనో.. చాలా మంది జిమ్‌లకు వెళ్లి వర్కువుట్లు చేస్తూ ఉంటారు. అయితే, ఒక్కో సారి జిమ్‌లో చోటుచేసుకునే ‍ప్రమాదాల కారణంగా తీవ్ర గాయలు అవ్వటమో.. ప్రాణాలు పోవటమో జరుగుతూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏటా వందల సంఖ్యలో జనం జిమ్‌లో చోటుచేసుకునే ప్రమాదాల కారణంగా మృత్యువాత పడుతూ ఉన్నారు. కొన్ని సార్లు అతిగా వ్యాయామాలు చేయటం వల్ల కూడా ప్రాణాలు పోతూ ఉంటాయి. శరీరం తీవ్ర అలసటకు గురైనపుడు ఇలాంటి జరుగుతూ ఉంటాయి.

ఇక, ఈ వార్తలో.. ఢిల్లీకి చెందిన 24 ఏళ్ల షక్సమ్‌ ప్రుతి అనే ఓ యువకుడు మంగళవారం ఉదయం సెక్టార్‌ 15లోని జిమ్‌కు వెళ్లాడు. అక్కడి ట్రెడ్‌ మిల్‌పై పరుగులు తీస్తూ ఉన్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ, ఉన్నట్టుండి అతడు ట్రెడ్‌ మిల్‌పై కుప్పకూలాడు. ఇది గమనించిన జిమ్‌ సిబ్బంది అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. షక్సమ్‌ను పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే చనిపోయినట్లు తేల్చారు. ఇక, ఈ సంఘటనపై పోలీసులు సమాచారం అందింది. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు షక్సమ్‌ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిన్న పోలీసులకు అందిన షక్సమ్‌ పోస్టుమార్టం రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందరూ అతడు గుండె పోటు కారణంగా చనిపోయాడని అనుకున్నారు. కానీ, అతడు కరెంట్‌ షాక్‌ కొట్టడం వల్ల చనిపోయినట్లు తేలింది. ట్రెడ్‌ మిల్‌ నుంచి షాక్‌ తగిలి అతడు చనిపోయాడని వెల్లడైంది. పోలీసులు జిమ్‌ ఓనర్‌పై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఇక, ఆ ట్రెడ్‌ మిల్‌ కరెంట్‌ షాక్‌ కొడుతోందంటూ చాలా మంది జిమ్‌ కస్టమర్లు ఓనవర్‌కు ఫిర్యాదు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments