Krishna Kowshik
హైదరాబాద్ నగరాన్ని గలీజు పనుల అడ్డాగా మార్చేస్తున్నారు కొందరు. అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్నారు. ఉద్యోగాల పేరిట వల వేసి.. నగరానికి తీసుకువచ్చి.. బలవంతంగా రొంపపు కూపంలోకి నెడుతున్నారు. తాజాాగా అటువంటి ముఠాను పోలీసులు చేధించారు.
హైదరాబాద్ నగరాన్ని గలీజు పనుల అడ్డాగా మార్చేస్తున్నారు కొందరు. అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్నారు. ఉద్యోగాల పేరిట వల వేసి.. నగరానికి తీసుకువచ్చి.. బలవంతంగా రొంపపు కూపంలోకి నెడుతున్నారు. తాజాాగా అటువంటి ముఠాను పోలీసులు చేధించారు.
Krishna Kowshik
గుట్టుచప్పుడు కాకుండా గలీజు దందాను చేస్తూ..డబ్బులు సంపాదిస్తున్నారు కొందరు. అమ్మాయిలను ఉద్యోగాలు పేరిట ఎర వేసి, ఇతర ఆర్థిక అవసరాలను క్యాష్ చేసుకుని.. వారికి మాయ మాటలు చెప్పి.. రొంపపు కూపంలోకి నెడుతున్నారు. అలా బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పట్టుకుంది టాస్క్ ఫోర్స్. హైదరాబాద్‌లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో.. టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టగా..ఈ వ్యవహారం బయటపడింది. ఈ మొత్తం గలీజ్ దందాకు కీలక సూత్రధారిగా రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ అని గుర్తించారు.
అఖిల్ పహిల్వాన్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఫార్చ్యూన్ హోటల్లోని కొన్ని గదులను బుక్ చేసుకుని.. ఉద్యోగాల పేరిట అమ్మాయిలను తీసుకువచ్చి.. బలవంతంగా ఈ రొంపలోకి దింపినట్లు సమాచారం. ఇందులో 16 మంది అమ్మాయిలు, నలుగురు కస్టమర్స్, ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేశారు. మహిళలు పశ్చిమ బెంగాల్ చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. ఉద్యోగాల పేరిట ఇక్కడకు రప్పించి.. అనంతరం వారితో వ్యభిచారం చేయిస్తున్నారని తెలిపారు. అఖిల్‌తో పాటు పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 22 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. అఖిల్ పహిల్వాన్ మొబైల్‌లో జాతీయ, అంతర్జాతీయంగా వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నంబర్లు ఉన్నాయి.
అతడు రోజు ముంబయి, ఢిల్లీలోని వ్యభిచార నిర్వాహకులతో అనేక కాల్స్ మాట్లాడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదంతా హైటెక్ వ్యభిచారంగా చెబుతున్నారు పోలీసులు. వీరంతా ఉద్యోగాల పేరిట అమ్మాయిలకు ఇక్కడకు రప్పించి.. వారితో బలవంతగా ఈ పాడు పని చేయిస్తున్నారని చెబుతున్నారు. ఇది గత కొన్ని రోజుల నుండి జరుగుతున్న దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. రైడ్స్ చేసి.. ఈ వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ హోటల్లో నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.