P Krishna
Gold and Silver Rates: పసిడి కొనుగోలు దారులకు గత వారం రోజుల నుంచి ఊరట లభిస్తుంది. గత నెలలో చుక్కలు చూపించిన బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి.
Gold and Silver Rates: పసిడి కొనుగోలు దారులకు గత వారం రోజుల నుంచి ఊరట లభిస్తుంది. గత నెలలో చుక్కలు చూపించిన బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి.
P Krishna
బంగారం ధరలు ఎప్పుడు పెరుతున్నాయో.. ఎప్పుడు తగ్గుతున్నాయో కొనుగోలుదారులకు అస్సలు అర్థం కావడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు, డాలర్ విలువలో మార్పులు, ఇటీవల పలు దేశాల్లో యుద్దాల కారణంగా వడ్డీ రేట్లలో హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి. వీటి ప్రభావం బంగారం, వెండి ధరలపై పడుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. గత నెల పసిడి, వెండి ధరలు భారీగా పెరిగిపోయాయి. ఒకదశలో మేలిమి బంగారం ధర 76వేలకు చేరుకుంది. ఇలాగే పెరిగిపోతే కొన్ని మాసాల్లో తులం బంగారం అక్షరాల లక్ష దాటుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ నెల మొదటి వారం నుంచి తగ్గుముఖం పట్టాయి. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
గత కొంత కాలంగా భారత దేశంలో బంగారం కొనుగోలు భారీగా పెరిగిపోయింది. బంగారం ఎంత ఎక్కువ ఉంటే సొసైటీలో అంత గౌరవంగా చూస్తున్నారన్న ఒక అభిప్రాయం ఉంది. అంతేకాదు పసిడి కొని దాచుకుంటే.. ఆపద సమయంలో ఆదుకుంటుంది. అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది బంగారం పై ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. ఇక పండుగలు, శుభ కార్యాలకు పసిడి తప్పని కొనడం ఆనవాయితీగా మారింది. ఈ మధ్య కాలంలో ధన్ తేరాస్, అక్షయ తృతీయ వంటి పండుగ వేళల్లో జ్యులరీ షాపు తరుగు, మేకింగ్ చార్జీల పై భారీ ఎత్తున డిస్కౌంట్ ఇస్తూ.. కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ.150 వరకు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,410 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసడి ధర రూ.66,390 కి చేరింది.
తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,360 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసడి ధర రూ.66,240 కి చేరింది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,260 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసడి ధర రూ.66,240 కి చేరింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,310 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసడి ధర రూ.66,290 కి చేరింది. ఇక కిలో వెండి ధర పై రూ.200 తగ్గి రూ.84,900 కి చేరింది. ఢిల్లీ,కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.84,900, హైదరాబాద్ లో రూ.88,400, ముంబై లో రూ.85,100, బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.84,200, చెన్నైలో కిలో వెండి ధర రూ. 88,400 వద్ద ట్రెండ్ అవుతుంది.
గమనిక : పసిడి, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.. ఈ పైన తెలుపబడిన సమాచారం సూచికగా మాత్రమే ఉంటుంది.