nagidream
Tata Smartphones: ఒకప్పుడు టాటా ఫీచర్ ఫోన్లు ఉండేవి. చాలా దృఢంగా ఉండేవి. 2జీ, 3జీ ఫోన్లు రావడం.. మెల్లగా టచ్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు రావడంతో టాటా కంపెనీ వెనక్కి తగ్గింది. అయితే మళ్ళీ ఇన్నాళ్లకు టాటా కంపెనీ స్మార్ట్ ఫోన్ తయారీ బిజినెస్ లోకి అడుగుపెట్టింది.
Tata Smartphones: ఒకప్పుడు టాటా ఫీచర్ ఫోన్లు ఉండేవి. చాలా దృఢంగా ఉండేవి. 2జీ, 3జీ ఫోన్లు రావడం.. మెల్లగా టచ్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు రావడంతో టాటా కంపెనీ వెనక్కి తగ్గింది. అయితే మళ్ళీ ఇన్నాళ్లకు టాటా కంపెనీ స్మార్ట్ ఫోన్ తయారీ బిజినెస్ లోకి అడుగుపెట్టింది.
nagidream
టాటా కంపెనీ పట్ల భారతీయులకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. టాటా గ్రూప్ కి చెందిన కంపెనీల నుంచి వచ్చే ఉత్పత్తులు నాణ్యమైనవిగా, మిడిల్ క్లాస్ వారికి బడ్జెట్ లో దొరికేవిగా ఉంటాయి. టాటా నానో కారు నుంచి టాటా స్టార్ మార్ట్, జుడియో వరకూ ఇలా టాటా కంపెనీ భారతీయులకు మేలు చేసేలా.. అందులోనూ మధ్యతరగతి వ్యక్తులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంది. అప్పట్లో లక్ష రూపాయలకే మిడిల్ క్లాస్ వారి కోసం కారు తీసుకొచ్చిన రతన్ టాటా.. ఆ తర్వాత ఆ ప్లాన్ ఫెయిల్ అయినా గానీ ఇప్పటికీ మధ్యతరగతి వారి గురించే ఆలోచిస్తున్నారు. స్టార్ మార్ట్, జుడియో స్టోర్ వంటి వాటిలో తక్కువ ధరకే కిరాణా సరుకులు, దుస్తులు వంటివి అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా టాటా కంపెనీ స్మార్ట్ ఫోన్ తయారీ బిజినెస్ లోకి అడుగుపెట్టబోతుంది. ఇటీవల దేశంలో యాపిల్ తయారీని ప్రారంభించగా.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ తయారీలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. అప్పట్లో టాటా ఫీచర్ ఫోన్లను తయారు చేసేది ఈ కంపెనీ. ఆ అనుభవంతో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల తయారీలోకి దిగనుంది. గతంలో కొన్ని కారణాల వల్ల ఫీచర్ ఫోన్ల తయారీ విభాగంలో ఫెయిల్ అయిన టాటా కంపెనీ.. ఈసారి మార్కెట్లో దూసుకుపోవాలని భావిస్తుంది. దీని కోసం చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు వివో భారతీయ యూనిట్ లో మెజారిటీ వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే సదరు సంస్థతో చర్చలు జరిపినట్లు సమాచారం. టాటా గ్రూప్ కోట్ చేసిన దాని కంటే వివో కంపెనీ ఎక్కువ మొత్తం అడుగుతుండడంతో తుది ఒప్పందం ఇంకా తేలలేదు.
అయితే టాటా గ్రూప్ కొనుగోలు పట్ల ఆసక్తిగానే ఉన్నట్లు సమాచారం. వివో సంస్థపై పన్ను ఎగవేత, మనీలాండరింగ్ సంబంధించి భారతీయ నియంత్రణ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో చైనాలోని బీబీకే గ్రూప్ కి చెందిన మరో స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో భారతీయ యూనిట్ ని ఉపసంహరించుకోవడానికి స్థానిక కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీతో ఏదైనా భారతీయ కంపెనీ భాగస్వామ్యంలో జాయింట్ వెంచర్ ఉండాలని భారత ప్రభుత్వం భావిస్తుంది. దేశీయ సంస్థకు 51 శాతం మెజారిటీ వాటా ఉండేలా ఆసక్తి కనబరుస్తోంది. అంతేకాకుండా ఈ జాయింట్ వెంచర్ లో స్థానిక నాయకత్వం, పంపిణీ వ్యవస్థ వంటివి కూడా స్వదేశీ సంస్థ చేతిలోనే ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది.